బిజినెస్

స్టార్టప్ నిబంధనల్లో ఎస్‌బీఐ మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 3: స్టార్టప్‌లకు నిర్దేశించిన నిధులను పెట్టుబడి పెట్టడంలో విఫలమవుతున్న భారతీయ స్టేట్ బ్యాంకు, నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. ‘మాది ప్రభుత్వరంగ సంస్థ. స్టార్టప్‌ల్లో పెట్టుబడి సాధారణంగా అధిక రిస్క్‌తో కూడుకున్నది. సంప్రదాయ మార్గంలో జరిపే పెట్టుబడుల వల్ల ప్రయోజనం లేదన్న అంశాన్ని మేం అర్థం చేసుకున్నాం’ అని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. ఆన్‌లైన్ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్, ఓలా యాప్ వంటి వాటి సామర్ధ్యాన్ని గుర్తించి, ఇటువంటి కంపెనీల సృష్టిపైనే దృష్టి కేంద్రీకరించామని పేర్కొన్నారు. ఫైన్‌టెక్ రంగానికి మద్దతు ఇచ్చే విషయంలో ఎస్‌బీఐకి ఒక విస్తృత ప్రాతిపదికన అమోదించిన విధానం ఉన్నదని, ఈ రంగంలో బ్యాంకు మరో రెండు అంశాల్లో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. మొదటిది సరకును అటువంటి స్టార్టప్‌లనుంచి సేకరించడం, సమన్వయంతో చురుకైన పాత్ర పోషించడం. ఎస్‌బీఐ 430 మిలియన్ల కస్టమర్లను కలిగివుంది. మొత్తం 1/3వంతు దేశ జనాభాకు సమానం. ఇప్పటివరకు బ్యాంకు 150 స్టార్టప్‌లతో పనిచేసింది. ఛాట్‌బాట్, డేటా ఎనలిటిక్స్ వంటివి ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం నవీ ముంబయిలోని, బేలాపూర్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ ద్వారా మొత్తం బ్యాంకు కార్యలాపాలు నడుస్తున్నాయి.