బిజినెస్

ఎయర్ ఇండియా సర్వీసుకు 70 ఏళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 3: ముంబయి నుంచి లండన్‌కు ఎయిర్ ఇండియా విమాన సర్వీసు ప్రారంభించి సరీగ్గా 70 ఏళ్లు నిండాయి. ఈ రెండు నగరాల మద్య 1948లో తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. తొలినాళ్లలో ఈ విమాన సర్వీసు లో ప్రయాణించిన భారత సంతతి వారు తమ అనుభవాలను పంచుకోవాలని ఎయిర్ ఇండియా పిలుపునిచ్చింది. 1948 జూన్ 8న, సూపర్ కాన్‌స్ట్‌లేషన్ విమా నం ముంబయి నుంచి బయలుదేరి, కైరో, జెనీవాల మీదుగా ప్రయాణించి, 1948, జూన్ 10న లండన్‌కు చేరుకుంది. ఈ విమానంలో మొత్తం 42 మంది ప్రయాణించారు. వీరిలో భారతీయ ‘మహారాజాలు’, ‘నవాబులు’ కూడా ఉన్నారు. తొలినాళ్లలో ఈ విమానంలో ప్రయాణించిన వారు తీపిగుర్తులుగా ఉంచుకున్న ఫోటోలు, డైరీల్లో రాసుకున్న అంశాలను పంచుకోవాలని ఎయిర్ ఇండియా భావిస్తోందని సంస్థ రీజినల్ మేనేజర్ దెబాశిష్ గోల్డర్ అన్నారు. నేడున్నన్ని సర్వీసులు నాడు లేవు.