బిజినెస్

నేడు పార్లమెంటరీ ప్యానల్ ముందుకు బ్యాంకర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఉన్నతోద్యోగులు, నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ), బ్యాంకింగ్ కుంభకోణాలపై పార్లమెంటరీ ప్యానల్‌కు సోమవారం సంక్షిప్తంగా వివరించనున్నారు. ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్‌కు చెందిన అధికార్లు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని వీరప్ప మొయిలీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థారుూ సంఘం ఆదేశాలు జారీచేసింది. దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులకు చెందిన ఉన్నతాధికార్లు ఇందులో సభ్యులు. బ్యాంకులకు పెరుగుతున్న నిరర్థక ఆస్తులు, తదితర సమస్యలపై పార్లమెంటరీ ప్యానల్‌కు వీరు వివరిస్తారని లోక్‌సభ బులిటెన్ వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించేందుకు ఆర్బీఐకి తగినన్ని అధికారాలు లేవని బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో, పార్లమెంటరీ ప్యానల్ ఈ సమావేశానికి పిలుపునిచ్చింది. ఇవే సమస్యలపై వివరించేందుకు ఊర్జిత్ పటేల్‌ను వచ్చే నెలలోతమ వద్దకు హాజరు కావాలని ప్యానల్ ఆదేశించింది. ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ గతంలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్యానల్‌కు వివరించారు. అంతకు ముందు మరో పార్లమెంటరీ ప్యానల్ ముందు హాజరైన బ్యాంకర్లు, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్రీ చట్టం సహాయంతో నిరర్థక అస్తుల సమస్యను పరిష్కరించవచ్చునని వెల్లడించినప్పటికీ, ఈ మార్గం తగిన ఫలితాలివ్వలేదు. కమీటీ సభ్యుడైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది. ఆధికారిక సమాచారం ప్రకారం 2017 డిసెంబర్ నెలాఖరుకు బ్యాంకుల సగటు నిరర్థక ఆస్తుల విలువ రూ.7.77 లక్షల కోట్లని తేలింది.