బిజినెస్

ద్రవ్య విధానమే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: ద్రవ్య విధానానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తీసుకోబోయే నిర్ణయాలు, ప్రపంచ వాణిజ్య పరిణామాలు, స్థూలార్థిక గణాంకాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా.3రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ల దృష్టి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, ప్రపంచ వాణిజ్య వివాదాల ఉద్రిక్తతలపై కేంద్రీకృతమయి ఉంటుంది. దేశీయంగా చూస్తే, ద్రవ్య విధానానికి సంబంధించి ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయా? అనే అంశాల కోసం మదుపరులు వేచి చూస్తున్నారు. అధిక ఇంధన ధరలు, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెరుగుతుందనే అంచనాలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయి. 3దేశంలో వరుసగా మూడో సంవత్సరం ఈ సంవత్సరం కూడా సాధారణ వర్షపాతం కురుస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, వర్షాలు కురిసే సమయం, ఏయే ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదవుతుందనేది ముఖ్యం2 అని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ రీసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. కీలక మిత్ర దేశాలయిన యూరోపియన్ యూనియన్, కెనడా సహా మెక్సికో తదితర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా దిగుమతి సుంకాలు విధించడంతో ఈ వారంలో ప్రపంచ వ్యాప్తంగా మదుపరుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ట్రంప్ చర్యకు స్పందనగా ఆయా దేశాలు ప్రతీకార చర్యలకు దిగుతాయేమోనన్న ఆందోళన మదుపరులలో నెలకొంది. ఇక దేశీయ పరిణామాల విషయానికి వస్తే, ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సర రెండో ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సమావేశం ఈ నెల నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకు జరుగనుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో ఆర్‌బీఐ 2017 ఆగస్టు నుంచి కీలక వడ్డీ రేట్లను సవరించలేదు. సేవల రంగానికి చెందిన పీఎంఐ గణాంకాలు కూడా వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. 3ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందనే ఆందోళన వచ్చే వారంలో స్టాక్ మార్కెట్లను నియంత్రించే అవకాశం ఉంది. అధిక ముడి చమురు ధరల కారణంగా ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. అధిక ముడి చమురు ధరల వల్ల వినియోగ వస్తువుల ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం పెరుగుతుంది2 అని సామ్‌కో సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జిమీత్ మోదీ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 302.39 పాయింట్లు (0.87 శాతం) పుంజుకొని, 35,227.26 పాయింట్ల వద్ద ముగిసింది.