బిజినెస్

17 శాతం తగ్గిన విమాన చార్జీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: 2017లో సగటున విమాన చార్జీలు 18 శాతం తగ్గిపోయాయని, ఇదే సమయంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య, 2014 నుంచి 2018 వరకు వార్షికంగా 19 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ‘సాఫ్‌నియత్ సహీ వికాస్’ శీర్షిక కింద ఆయన వరుస ట్వీట్‌లు చేస్తూ, దేశీయంగా విమానాల తయారీకి సంబంధించి బ్లూ ప్రింట్‌ను తమ మంత్రిత్వశాఖ రూపొందిస్తున్నదన్నారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం కింద ఈ కృషి కొనసాగుతోందన్నారు. 2015తో పోలిస్తే 2018లో సగటున 18 శాతం విమానచార్జీల ధరలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. 2018 ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానాలు మొత్తం 12కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యాలకు చేర్చగా, 2014లో ఇది కేవలం 6.1 కోట్లు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మక విధానాలను అనుసరించడం వల్లనే దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడానికి కారణమన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 26 నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘సాఫ్ నియత్, సహీ వికాస్’ నినాదాన్ని ప్రవేశపెట్టింది. 44వ నెల వరుసగా దేశంలో విమానయాన ప్రయాణికుల సంఖ్య రెండంకెల శాతం వృద్ధి నమోదు చేయడం గమనార్హం. గత రెండేళ్ల కాలంలో విమాన ధరలు ఒకేవిధంగా ఉండగా, చమురు ధరలు మాత్రం రెట్టింపయ్యాయి. ‘రాబోయే దశాబ్దంలో, బిలియన్ విమాన ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకోసం ‘నభ్ నిర్మాణ్’ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు మంత్రి ట్వీట్ చేశారు. 2018-19 బడ్జెట్‌లో నభ్ (నెక్స్‌ట్ జనరేషన్ ఎయిర్‌పోర్ట్స్ ఫర్ భారత్) నిర్మాణ్ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఏడాదిలో బిలియన్ ట్రిప్పులకు అనువుగా విమానాశ్రయాల సామర్ధ్యాన్ని విస్తరించే ప్రణాళికలను రూపొందించినట్టు ప్రభుత్వం పేర్కొంది.