బిజినెస్

కొత్త చైర్మన్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అనే్వషణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 4: భారత్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ కొత్త చైర్మన్ కోసం అనే్వషణ ప్రారంభించింది. ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న ఎంకె శర్మ పదవీ కాలం ఈ నెల 30తో ముగుస్తుండటంతో ఆయన స్థానంలో చైర్మన్ కోసం బ్యాంక్ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌లుగా ఉన్నవారిని నియమించాలా? లేక బయటి నుంచి ఎవరినైనా తీసుకువచ్చి ఈ పదవి అప్పగించాలా అన్నది బోర్డు నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న స్వతంత్ర డైరెక్టర్‌లలో ఇటీవలే చేరిన బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఎండి మాల్యా ఈ పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఉదయ్ చిటలే, దిలీప్ ఛోక్సీ, నీలమ్ ధావన్, రాధాకృష్ణనాయర్, వికె శర్మ, లోక్‌రంజన్ ఐసిఐసిఐ స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు.
ఇలావుండగా, బ్యాంక్ సిఇఓ, ఎండి చందాకొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై బ్యాంక్ బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు సిద్ధపడుతోంది. కొంతమందికి రుణాల మంజూరులో, వాటి రద్దులో సీఈవో పక్షపాత, అనుకూల ధోరణితో వ్యవహరించి క్విడ్ ప్రో క్యూకి పాల్పడ్డారని విమర్శలు రావడంతో సమగ్ర దర్యాప్తు చేయాలని భావిస్తోంది. ఈ విచారణలో ఈ ఆరోపణలకు సంబంధించి ఫోరెన్సిక్, ఈమెయిల్స్, రికార్డులు, స్టేట్‌మెంట్‌లు, ఇతర అంశాలను సమగ్రంగా పరిశీలిస్తారు. విశ్వసనీయమైన స్వతంత్ర వ్యక్తితో దీనిపై దర్యాప్తు నిర్వహిస్తామని బ్యాంక్ పేర్కొంది. కాగా, మార్కెట్‌ను నియంత్రించే సెబీ ఇప్పటికే వీడియోకాన్, నూ పవర్‌లతో చందాకొచ్చర్ జరిపిన లావాదేవీలపై నోటీసును జారీ చేసింది. క్విడ్ ప్రో క్యూ పద్ధతిన సిఇఓ చందాకొచ్చర్ వీడియోకాన్ సంస్థకు పెద్దయెత్తున రుణాలను మంజూరు చేశారని, దానికి ప్రతిగా కొచ్చర్ భర్తకు చెందిన ను పవర్‌లో వీడియోకాన్ పెట్టుబడులు పెట్టిందని, తర్వాత వీడియోకాన్‌కు ఇచ్చిన రుణాలను మాఫీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏప్రిల్‌లో ఈ కుంభకోణం వెలుగుచూడగా, బ్యాంక్ బోర్డు తొలుత ఆమెపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. బ్యాంక్ బోర్డు, బ్యాంకుల కన్సార్టియం అనుమతుల మేరకే లావాదేవీలు జరిగాయని ప్రకటించింది. అయితే రానురాను కొచ్చర్‌పై ఉచ్చు బిగుసుకుంటుండటంతో గతిలేని స్థితిలో ఆమెపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తునకు పూనుకుంటోంది. ఇప్పుడు చేస్తున్న దర్యాప్తు ఈ అక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలను వెలికితీస్తుందని బోర్డు ప్రకటించింది.