బిజినెస్

రోజువారీ సమీక్ష ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దహేజ్ (గుజరాత్): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సమీక్షించే ప్రసక్తే లేదని ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. అయితే ఇంధన ధరలు అదుపు చేసే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, దీనికి దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనడంపై దృష్టిపెట్టిందని ఆయన తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరలపై సహేతుకంగా బాధ్యతాయుత రీతిలో పన్నులు విధించాలని కోరిన ఆయన ‘పెరుగుతున్న చమురు ధరల నుంచి లాభాలను ఆర్జించే ప్రయత్నం చేయకూడదు’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి చముర ధరల దైనందిన సమీక్షించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించిన ఆయన గత ఐదు రోజులుగా వీటి ధరలు తగ్గుతూనే వస్తున్నాయని, కాని అమ్మకం రేట్లు మాత్రం పెరుగుతున్నాయని తెలిపారు. రష్యాతో కుదుర్చుకున్న దీర్ఘకాల కాంట్రాక్టులో భాగంగా ఎల్‌ఎన్‌జీ తొలి కార్గో దిగుమతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా మార్చే విధానాన్ని గత ఏడాది జూన్‌లో అమలులోకి తెచ్చారు. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా రోజువారీగా వీటి రేట్లు పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అప్పట్లోనే ఈ సమస్యకు దీర్ఘకాల పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తోందన్న కథనాలూ వెలువడ్డాయి. పెరుగుతున్న చమురు ధరల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టిందని, వీటిని తగ్గించేందుకు మార్గాంతరాన్ని అనే్వషిస్తోందని ప్రధాని అన్నారు. పాక్షికంగా కాకుండా పరిపూర్ణ రీతిలో ఈ సమస్యను దీర్ఘకాల ప్రాతిపదికన పరిష్కరిస్తేనే ధరల పరంగా వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. పెట్రోలు, డీజిల్‌పై సీపీఎం సారథ్యంలోని కేరళ ప్రభుత్వం అమ్మకం పన్నును రూపాయి తగ్గించిన విషయాన్ని గుర్తుచేసినప్పుడు ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు తాము ఆహ్వానిస్తామని, అయితే దీన్ని రాజకీయపరంగా చూడ్డానికి వీలులేదని అన్నారు. గత ఏడాది నవంబర్‌లో పెట్రోలు, డీజిల్‌పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం స్థిరంగా ఉంటుందని, రిటైల్ ధరల మార్పుతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. పన్నులు తగ్గించే విషయంలో రాష్ట్రాలను తాము అభ్యర్థించగలమే తప్ప ఆదేశించలేమని అన్నారు. 2010-14 సంవత్సరాల మధ్య అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో చమురు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని ఆరోపించిన ధర్మేంద్ర ప్రధాన్, ఆనాటి ఆ ప్రభుత్వ చర్యల కారణంగానే చమురు కంపెనీలకు జారీచేసిన బాండ్లను తాము తిరిగి చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం చమురు సబ్సిడీ కోసం ఆయిల్ కంపెనీలకు బాండ్లను జారీచేసిందని, ఇప్పుడా భారం తమ ప్రభుత్వంపై పడిందని ప్రధాన్ అన్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో చమురు ధరల గురించి తాను మాట్లాడానని, సామాన్యుడి ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని పరిష్కారాన్ని కనుగొంటామన్నారు. అంతర్జాతీయ ధరల పెరుగుదల, రూపాయి మారక ఒడిదుడుకులు, కొన్ని రకాల పన్నుల కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు.