బిజినెస్

నిదానించిన సేవారంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: గత మూడు నెలల కాలంలో మొదటిసారిగా మే నెలలో భారత సేవారంగం కార్యకలాపాలు తగ్గిపోయాయి. కొత్త బిజినెస్ ఆర్డర్లు లేకపోవడం, చమురు ధరలు, నిర్వహణా ఖర్చులు పెరిగిపోవడంతో సేవారంగం తీవ్ర ఒత్తిడికి లోనైంది. అయితే 2015, జనవరి నుంచి బిజినెస్ సెంటిమెంట్ బలీయంగా ఉన్న నేపథ్యంలో, రాబోయే కాలంలో పరిస్థితిలో మెరుగుదల తప్పక కనిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతుండటం సానుకూల పరిణామం. నిక్కీ ఇండియా బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఏప్రిల్‌లో 51.4 ఉండగా మేనెలలో 49.6గా నమోదైంది. విపరీతమైన పోటీ, కొత్త ఆర్డర్లు లేకపోవడం మేనెలలో సేవారంగంపై ప్రతికూల ప్రభావానికి దారితీసింది. ‘‘్ఫబ్రవరి నుంచి భారత్ మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ ప్రగతి నిదానించింది. అయితే ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం పెరిగిన ముడిచమురు ధరలు, ప్రైవేటు రంగంలో ఉత్పాదక ఖర్చు మరింతగా పెరగడానికి దోహదం చేశాయి,’ అని ఆర్థిక రంగ నిపుణుడు దోహియా వివరించారు. అయితే సేవారంగం నిదానించిన ప్రభావం లేబర్ మార్కెట్‌కు సానుకూలంగా మారింది. ఏప్రిల్ నెలలో లేబర్ మార్కెట్‌లో ఉపాధి అవకాశాలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. సీజన్లవారీ సర్దుబాటు చేసే నిక్కీ ఇండియా కంపోసిట్ పీఎం ఔట్‌పుట్ సూచిక ఏప్రిల్‌లో 51.9 నుంచి మే నెలలో 50.4కు పడిపోయింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ, వడ్డీరేట్లు పెంచే అవకాశమున్నదని అంచనాలు కొనసాగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకోవచ్చునన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇదిలావుండగా ఆర్‌బీఐ తన విధాన నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి తొలిసారి ఏప్రిల్ నెలలో ఆర్‌బీఐ ప్రకటించిన తన విధానలో, రెపోరేటును 6 శాతంగానే కొనసాగించింది. ఇందులో ఏవిధమైన మార్పు చేయలేదు.