బిజినెస్

మన ఎగుమతులు ఎక్కువగా అమెరికాకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: భారత్ నుంచి రికార్డు స్థాయిలో వివిధ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. భారత్ వస్తువుల వినిమయానికి అమెరికా గమ్యస్థానంగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో 47.9 బిలియన్ డాలర్ల వస్తువులు అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యాయి. ఈ వివరాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్ దేశాలకు భారత్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 28.1 బిలియన్ డాలర్లు, హాంకాంగ్‌కు 14.7 బిలియన్ డాలర్ల మేర వస్తువులను భారత్ ఎగుమతి చేస్తోంది. చైనా, సింగపూర్, యుకె, జర్మనీ, బంగ్లాదేశ్, వియత్నాం, నేపాల్ దేశాలకు వరుసగా భారత్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. పెట్రోలియం, ముత్యాలు, విలువైన లోహాలు, విలువైన రంగు రాళ్లు, ఫార్మాసూటికల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, రసాయనాలు, జౌళి, బియ్యం ఉత్పత్తులు భారత్ నుంచి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆ దేశానికి మన దేశ రికార్డు స్థాయిలో వివిధ వస్తు ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రొఫెసర్ రాకేష్ మోహన్ జోషి తెలిపారు. భారతీయ వస్తువులు గరిష్టస్థాయిలో వినిమయం చేసే జాబితాలో అమెరికాదేశం మొదటి స్థానంలో ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయి తెలిపారు.