బిజినెస్

ఇంటి దొంగల భరతం పట్టుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: వాట్సప్‌ల ద్వారా స్టాక్ మార్కెట్ ధరల సమాచారాన్ని ముందుగా తమకు కావాల్సిన వారికి జారేసే ఇంటి దొంగల భరతం పట్టాలని స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబి నిర్ణయించింది. డజనుకుపైగా బ్లూచిప్ కంపెనీల్లో పనిచేసే ఆపరేటర్లు, సీనియర్ సిబ్బంది వాట్సప్ ద్వారా సున్నితమైన స్టాక్ ధరలను ముందుగా లీక్ చేస్తున్నారు. ఇనె్వస్టర్లకు తెలియచేయకుండా ముందుగా కంపెనీలకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్న కంపెనీల జాబితాను సెబి రూపొందించినట్లు సెబి వర్గాలు తెలిపాయి. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పాల్పడే సంస్థల సమాచారాన్ని సెబి సేకరించింది. ఈ కంపెనీల కార్యకలాపాలపై దర్యాప్తు దాదాపు పూర్తికావచ్చింది. తుది సమాచారం సేకరించిన తర్వాత బాధ్యులైన కంపెనీలపై సెబి చర్యలకు ఉపక్రమిస్తుందని సెబి వర్గాలు తెలిపాయి. కొన్ని బ్రోకర్ కంపెనీల సిబ్బంది కూడా కంపెనీల సమాచారాన్ని లీక్ చేస్తున్నాయనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని వారు పేర్కొన్నారు. తమకు అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని ఇప్పటికే సెబి ఆయా కంపెనీలకు అంతరంగికంగా ఆదేశాలు ఇచ్చింది. రెగ్యులేటర్ కోరిన సమాచారాన్ని అందించినట్లు తాజాగా ఫైలింగ్ చేసిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన సెబి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నామని బ్యాంకు పేర్కొంది. కార్పోరేట్ సుపరిపాలనలో అత్యున్నత ప్రమాణాలను తమ బ్యాంకు పాటిస్తోందని ఆ బ్యాంకు పేర్కొంది. అంతరంగికంగా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని, ఈ అంశంపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని హెచ్‌డిఎఫ్‌సిని గతంలో సెబి ఆదేశించింది. టాటామోటార్స్, యాక్సిస్ బ్యాంకు, బాటా ఇండియా తదితర సంస్థలకు ఈ మేరకు సెబి ఆదేశాలు జారీ చేసింది. దాదాపు12 సంస్థల కార్యకలాపాలపై సెబి నిఘా పెట్టింది. కాగా సెబి ఆదేశాలను పాటిస్తామని ఇప్పటికే నాలుగు సంస్థలు సెబికి సమాచారం ఇచ్చాయి. కంపెనీలు ప్రతి త్రైమాసికానికోసారి కంపెనీ ఆర్థిక ఫలితాలు జారీ చేస్తాయి. కంపెనీలు అధికారికంగా ప్రకటించే ముందే, వాట్సప్‌గ్రూపుల్లో ఈ సంస్థల ఆర్థిక ఫలితాలు ప్రత్యక్షమవుతున్నట్లు సెబి వద్ద సమాచారం వచ్చింది. ఆడిటర్లు, బ్రోకర్లు, అనలిస్టులు, ఇనె్వస్ట్‌మెంట్ సలహాదారులు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లపై సెబి దృష్టి పెట్టింది.