బిజినెస్

మార్కెట్లకు మళ్లీ నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 5: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం ద్రవ్య విధాన నిర్ణయాలను ప్రకటించనుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరులు మంగళవారం ఆచితూచి వ్యవహరించారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటి (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం మొదలయింది. బుధవారంతో ముగియనున్న ఈ సమావేశంలో 2014 జనవరి తరువాత తొలిసారి కీలక వడ్డీ రేట్లను పెంచుతూ ఎంపీసీ నిర్ణయం తీసుకుంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మదుపరులు మంగళవారం ఆచితూచి అడుగులు వేయడంతో మార్కెట్లు నష్టపోయాయి. కీలక సూచీలు రెండూ పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 109 పాయింట్లు పడిపోయి, కీలకమయిన 35,000 మార్కుకన్నా దిగువకు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 35 పాయింట్లు దిగజారింది. సెనె్సక్స్ మంగళవారం సెషన్‌లో చాలామట్టుకు ప్రతికూల జోన్‌లోనే కొనసాగింది. ఇంట్రా-డేలో ఒక దశలో 34,784.68 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 108.68 పాయింట్ల (0.31 శాతం) దిగువన 34,903.21 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ పడిపోవడం వరుసగా ఇది మూడో సెషన్. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 310.49 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 35.35 పాయింట్ల (0.33 శాతం) దిగువన 10,593.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,633.15- 10,550.90 పాయింట్ల మధ్య కదలాడింది. వడ్డీ రేట్లతో ఎక్కువగా ప్రభావితమయ్యే స్థిరాస్తి, బ్యాంకింగ్, వాహన రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కొత్త బిజినెస్ ఆర్డర్లు స్తంభించిపోవడం, అధిక ఇంధన ధరల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడం మూలంగా దేశ సేవల రంగం కార్యకలాపాలు మే నెలలో మొదటిసారి మూడు నెలల కనిష్టానికి పడిపోయినట్లు పీఎంఐ గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాలు కూడా మంగళవారం స్టాక్ మార్కెట్‌లో మదుపరుల ట్రేడింగ్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇదిలా ఉండగా, సోమవారం నాటి లావాదేవీలలో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 712.41 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 2,354.03 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.