బిజినెస్

పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ 11.5 శాతానికి చేరే అవకాశం ఉందని క్రెసిల్ అనే సంస్థ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ 11.2 శాతానికి చేరింది. దీని విలువ రూ.10.3 లక్షల కోట్లు. అంతకుముందు ఏడాది 2016-17లో బ్యాంకుల ఎన్‌పిఏ విలువ 9.5 శాతం నమోదైంది. దీని విలువ రూ. 8 లక్షల కోట్లు. ఈ ఏడాది బ్యాంకుల ఎన్‌పిఏ 11.5 శాతానికి చేరి ఆ తర్వాత క్రమేపి తగ్గుతుందని క్రెసిల్ సంస్థ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకుల ఎన్‌పిఎ పెరగడం వల్ల నష్టాలు రూ.40 వేల కోట్లకు పెరిగాయి. అదే సమయంలో రూ.5లక్షల కోట్ల రుణాలు నిరర్థక ఆస్తుల విలువగా మారాయి. గత మూడు సంవత్సరాల్లో ఎన్‌పిఎల విలువ రూ. 13.6లక్షల కోట్లకు పెరిగినట్లు క్రెసిల్ పేర్కొంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)కు రెఫర్ చేయడం వల్ల రికవరీ పెరిగింది.
స్టీల్ సెక్టార్‌కు ఇచ్చిన రూ.3.3 లక్షల కోట్లలో నాల్గవ వంతు రుణాలు ఉన్న సంస్థలను ఎన్‌సిఎల్‌టికి రెఫర్ చేసినట్లు క్రెసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. బేసిల్ 3 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాల ఆధీనంలో ఉన్న బ్యాంకులు కేపిటల్ నిమిత్తం ప్రభుత్వంపై ఎక్కువ ఆధారపడుతున్నాయని క్రెసిల్ డైరెక్టర్ రామ పటేల్ చెప్పారు. బ్యాంకుల ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్రం గత ఏడాది అక్టోబర్‌లో రూ.2.1 లక్షల కోట్లతో స్కీంను ప్రకటించింది. కాని బ్యాంకులు చవి చూస్తున్న నష్టాలు, పెరుగుతున్న నిరర్ధక ఆస్తుల విలువను విశే్లషిస్తే, ఈస్కీంలో పొందుపరిచిన ఆఫర్ చాలదని క్రెసిల్ పేర్కొంది.