బిజినెస్

త్వరలో ‘కుసుం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రైతులకు శుభవార్త. కేంద్రం రూ. 1.4 లక్షల కోట్ల వ్యయంతో కిసాన్ ఊర్జ సురక్ష ఎవం ఉత్తాన్ మహాభియాన్ (కుసుం) స్కీంను త్వరలో అమలు చేయనుంది. ఈ స్కీం కింద రైతులకు సౌర విద్యుత్‌తో పనిచేసే నీటి పంపులను సమకూర్చుతారు. వచ్చే నెల నుంచి ఈ స్కీంను అమలు చేయనున్నట్లు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ చెప్పారు. సౌభాగ్య స్కీం కింద దేశంలో నాలుగు కోట్ల కుంబాలకు విద్యుత్ కనెక్షన్లు అందించామని, ఈ స్కీం అమలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, 27.5 లక్షల సౌర విద్యుత్ నీటి పంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఇందులో 50 వేల గ్రిడ్‌తో అనుసంధానమైన గొట్టపు బావులు, ఎత్తిపోతల, మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు. త్వరలో జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఊతం ఇచ్చే విధంగా ఒకస్కీంను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ స్కీం విలువ దాదాపు రూ.16వేల కోట్లని చెప్పారు. వచ్చే కేంద్రమంత్రివర్గ సమావేశంలో కుసుమ, జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రోత్సాహం స్కీంలను చర్చించి తుది రూపు ఇవ్వనున్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లలో అదనంగా 24వేల మెగావాట్లవిద్యుత్ కెపాసిటీ పెంచామన్నారు. 2014కు ముందు 48 ఏళ్లలో విద్యుత్ అభివృద్ధిని విశే్లషిస్తే, సాలీనా 4800 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఒక లక్ష మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత నాలుగేళ్లలో ఒక దేశం, ఒక గ్రిడ్, ఒకే ధరగా విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దామన్నారు. 2022 నాటికి 175 జిడబ్ల్యు కెపాసిటీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. ఉదయ్ స్కీం వల్ల డిస్కాంలకు రూ. 20వేల కోట్ల వడ్డీ భారం తగ్గిందన్నారు. 33 శాతంమేర రెవెన్యూ లోటును డిస్కాంలు తగ్గించుకున్నాయన్నారు. ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ గెటింగ్ ఎలక్ట్రిసిటీ రేటింగ్‌ను విశే్లషిస్తే భారత్ ర్యాంకు 111 నుంచి 29వ ర్యాంకుకు పెరిగిందని ఆయన చెప్పారు.