బిజినెస్

లాభపడిన దేశీయ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 6: మూడు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తిరిగి బలపడ్డాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనతో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచినప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గణనీయంగా 276 పాయింట్లు పుంజుకొని కీలకమయిన 35,000 పాయింట్ల స్థాయికి పైన ముగిసింది. అయితే, పెట్టుబడులు పుంజుకుంటాయని, అధిక వినియోగం నమోదవుతుందనే విశ్వాసంతో 2018-19 ఆర్థిక సంవత్సర దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను ఆర్‌బీఐ 7.4 శాతంగానే కొనసాగించడం మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసిందని బ్రోకర్లు పేర్కొన్నారు. రూపాయి బలపడటం, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ధోరణి కూడా దేశీయ మార్కెట్ కీలక సూచీలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనతో నాలుగున్నరేళ్లలో తొలిసారి బుధవారం కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ పెంచింది. సెనె్సక్స్ బుధవారం ఉదయం 34,932.49 పాయింట్ల పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయి, ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు వెలువడిన వెంటనే పడిపోయింది. అయితే, కొంత సేపటికే తిరిగి పుంజుకొని ఇంట్రా-డేలో 35,230.54 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 275.67 పాయింట్ల (0.79 శాతం) పైన 35,178.88 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం మూడు సెషన్లలో కలిసి 419.17 పాయింట్లు పడిపోయింది. సెనె్సక్స్ బాటలోనే నిఫ్టీ కూడా బుధవారం క్రితం ముగింపుతో పోలిస్తే 91.50 పాయింట్ల (0.86 శాతం) పైన 10,684.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, మంగళవారం నాటి లావాదేవీలలో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 474.33 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 157.51 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
బుధవారం నాటి లావాదేవీలలో టెలికం షేర్లు బాగా లాభపడ్డాయి. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ టెలికం ఇండెక్స్ అత్యధికంగా 3.02 శాతం పుంజుకుంది. సెనె్సక్స్ ప్యాక్‌లోని భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా 4.55 శాతం లాభపడింది. లాభపడిన ఇతర సంస్థలలో టాటా మోటార్స్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, విప్రో, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, మారుతి సుజుకి, రిల్ ఉన్నాయి. మరోవైపు, ఓఎన్‌జీసీ, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.47 శాతం వరకు నష్టపోయాయి.