బిజినెస్

పెరిగిన కీలక వడ్డీ రేట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 6: నాలుగేళ్లలో మొదటి సారిగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపోరేటును ప్రస్తుతం అమలులో ఉన్న 6 శాతానికి అదనంగా 0.25 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. దీని వల్ల బ్యాంకుల గృహ రుణాలు, వాహనాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం వత్తిడితో రేపోరేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి కమటీ ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులు కూడా రెపో రేటును పెంచేందుకు అనుకూలంగా ఓటు వేశారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు రుణాలు తీసుకుని వడ్డీలను చెల్లించడాన్ని రెపోరేటు అంటారు. అదే ఆర్‌బీఐ వద్ద డిపాజిట్లను పెట్టి వడ్డీని తీసుకుంటే రివర్స్ రెపో రేటు అని అంటారు. 2014 జనవరి 18వ తేదీ తర్వాత తొలిసారిగా ఆర్‌బీఐ రేపోరేటును పెంచింది. గత నాలుగేళ్లలో ఆరుసార్లు వడ్డీరేట్లను తగ్గించారు. 2017 ఆగస్టు 2వ తేదీన జరిగిన సమావేశంలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించి ఆరుశాతం వద్ద రేపో రేటు నిలకడగా ఉండేటట్లు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరగడం, ముడి చమురు ధరలు పెరిగినా, జిడిపి వృద్ధిరేటు 7.4 శాతం వద్దనే నిలకడగా ఉంది. వినిమయ ధరల సూచిక ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 4.6 శాతం ఉంటుందని, రెండవ అర్ధ సంవత్సరంలో 4.7 శాతం ఉంటుందని అంచనావేశారు. రేపో రేటు పెరుగుతుందని అంచనా వేసి ముందుగా ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు గత వారంరోనే వడ్డీ రేట్లను 0.1 శాతం మేర పెంచాయి. దీని వల్ల రుణాలు తీసుకున్న వారిపై భారం పెరిగింది. గత మూడు రోజులుగా ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతవహించారు. రివర్స్ రేపోను 6 శాతం వద్దనే ఉండే విధంగా సర్దుబాటు చేశారు. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం 4 శాతం వద్దనే నిలకడగా ఉంటుందనే ఆశాభావాన్ని ద్రవ్య పరపతి కమిటీ (ఎంపిసి) వ్యక్తం చేసింది. ద్రవ్యపరపతి విధానంపై తటస్ధవైఖరిని అవలంభించినట్లు ఎంపిసి పేర్కొంది. ఇటీవలకాలంలో దేశీయ ఆర్థిక రంగం నిలకడతో వృద్ధిరేటును సాధించినట్లు ఉర్జిత్ పటేల్ చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో హెచ్చుతగ్గులు, రాజకీయ పరిణామాల వల్ల దేశీయాభివృద్ధిపై ప్రభావం చూపెట్టాయని చెప్పారు. ముడి చమురు ధరల్లో చోటు చేసుకుంటున్న హెచ్చుతగ్గులు ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ముడి చమురు బ్యారెల్ ధర 66 డాలర్ల నుంచి 74 డాలర్లకు పెరిగిందన్నారు. ద్రవ్యోల్బణం తీరు తెన్నులపై ఆర్‌బీఐ అప్రమత్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సమావేశం సభ్యులు చేతన్ గాటే, పామి దువ, రవీంద్ర హెచ్ దొలాకియా, మైఖేల్ దెబబ్రతా పాత్రా, విరాల్ వి ఆచార్య, ఉర్జిత్ పటేల్ రెపో రేటు పెంపుదలకు అనుకూలంగా ఓటు వేశారు. ఈ నెల 20వ తేదీన ఈ వివరాలపై నివేదికను విడుదల చేస్తారు.