బిజినెస్

అభివృద్ధికి ఆటంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెపో రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచడం వల్ల బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతాయని, దీనివల్ల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఆర్‌బిఐ బుధవారం రేపో రేట్లను పెంచడం వల్ల పెట్టుబడులపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలనే సంకేతాలు ఇచ్చినట్లయిందని కొంత మంది నిపుణులంటున్నారు. రెపో రేటును పెంచడం తొందరపాటు నిర్ణయమనే వాళ్లు కూడా ఉన్నారు. రెపో రేటును పెంచడం వల్ల అభివృద్ధి మందగిస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని సమర్ధంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, అంతేకాని రెపో రేట్లను పెంచడం పరిష్కారమార్గం కాదని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించి అభివృద్ధికి ఆటంకాలను తొలగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు పెంచిన రెపోను మరి కొంత కాలం కొనసాగించి ఆ తర్వాత మళ్లీ యదాతథ స్థితికి తీసుకురావాలని, ఈ పెంపు పారిశ్రామిక వర్గాలకు రుచించదని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ పేర్కొన్నారు. దేశంలో ఆర్ధికాభివృద్ధి వేగవంతమవుతుందని ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్టర్స్ సంస్థ ఇఇపిసి ఇండియా చైర్మన్ రవి సెహ్గాల్ తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న దృష్ట్యా రెపో రేటును పెంచడం అనివార్యమని రియాల్టీ సంస్థ నారెడ్కో జాతీయాధ్యక్షుడు నిరంజన్ హిరనందని తెలిపారు. రియల్ ఎస్టేట్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఆర్‌బీఐ రెపో రేట్లను ఇంకా పెంచే అవకాశం ఉందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు పేర్కొంది. పంట ఉత్పత్తులకు గిట్టుబాటుధరలు కల్పించడం తదితర నిర్ణయాల వత్తిడి ఆర్‌బీఐ రెపో రేటుపై ఉంటుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండి జార్జి అలెగ్జాండర్ పేర్కొన్నారు.