బిజినెస్

3.3 శాతానికి మించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: భారత్ ఆర్ధిక లోటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 3.3 శాతానికి మించదని మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీసస్ ప్రకటించింది. బడ్జెట్‌లో నిర్దేశించిన విధంగా పెట్టుబడుల వినియోగం తగ్గినా ఆర్థికలోటు మాత్రం 3.3 శాతానికి మించి ఉండదని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు, సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ విలియమ్ పోస్టర్ తెలిపారు. కాగా ముడి చమురు ధరల పెరగడం వల్ల పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారని, దీని వల్ల భారత్ పరపతి విధానంపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఆర్థిక, సంస్థాగత సంస్కరణలు నిరంతరం కొనసాగుతున్నాయని, వృద్ధిరేటు ఆశాజనకంగా ఉందని ఆయనచెప్పారు. ఈ ఏడాది ఆర్థికలోటు 3.3 శాతాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంకావాల్సి ఉందన్నారు. వస్తుసేవాపన్ను, పెట్రోలియం ఉత్పత్తుల ఎక్సైజ్ సుంకానికి సంబంధించి రెవెన్యూ వసూళ్లలో కొంత రిస్క్ కనపడుతోందన్నారు. సకాలంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపులు, పన్నురేట్ల మార్పుల వల్ల రెవెన్యూ నష్టాలు తప్పవన్నారు. కాగా ఆర్థికాభివృద్ధి రేటు నిలదొక్కుకున్నందు వల్ల ఆశించిన స్థాయిలో రెవెన్యూవసూళ్లలో ఎటువంటి సవాళ్లు ఎదురుకాకపోవచ్చన్నారు. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఇండియా కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. ఇప్పుడున్నట్లుగానే ముడి చమురు ధరలు కొనసాగితే, కరెంట్ అకౌంట్ లోటు 2.4 శాతానికి చేరుతుందని ఇక్రా ప్రధాన ఆర్థిక వేత్త ఆదితి నాయర్ పేర్కొన్నారు. పెట్టుబడుల మద్దతు ప్రణాళిక ప్రకారం బ్యాంకులు రూ. 58వేల కోట్లను ఈక్వి టీ మార్కెట్ నుంచి సేకరిస్తాయని కేంద్రం ఆశించింది. కాని రూ.10 వేల కోట్ల కంటే మించి సేకరించలేకపోయాయి. 2018లో బ్యాంకు వాటా ధరలు క్షీణించడంతో, ఇవి ఏమాత్రం ఈక్విటీ మార్కెట్ నుంచి నిధులు సేకరించలేవని మూడీ స్ ఇనె్వస్టర్స్ సర్వీస్ తెలిపింది. ఈ ఏడాది ప్రారం భం నుంచి నేటి వరకు విశే్లషిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ ధరలు 19 శాతం క్షీణించాయి.