బిజినెస్

గ్రామ పంచాయతీల్లో 5లక్షల వైఫై హాట్ స్పాట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అంచనా వ్యయం రూ. 4 వేల కోట్లు * టెండర్లను ఆహ్వానించిన కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 7: దేశవ్యాప్తంగా ఐదు లక్షల వైఫై హాట్‌స్పాట్స్‌ను నెలకొల్పేందుకు కేంద్రం ప్రణాళికను ఆమోదించింది. వీటిని గ్రామ పంచాయితీల్లో ఏర్పాటు చేస్తారు. దీని కోసం రూ. 4వేల కోట్ల అంచనాలతో టెండర్లను ఆహ్వానించారు. ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో వైఫై సేవలు అందించాలని కేంద్రం విధాన నిర్ణయం తీసుకుంది. భారత్ నెట్ ప్రొగ్రాం ఆఫ్ భారత్ బ్రాడ్ బాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ టెక్నాలజీ ద్వారా వైఫై సేవలను అందిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ స్కీంను అన్ని గ్రామ పంచాయితీలకు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వైఫై హాట్ స్పాట్స్‌సేవలను ప్రజలతో పాటు పోలీసు స్టేషన్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, పోస్ట్ఫాసులకు అందిస్తారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ సేవలను అందిస్తారు. పట్టణ ప్రాంతాల ప్రజలతో సమానంగా గ్రామీణ ప్రజలు టెక్నాలజీ పరంగా అప్‌డేట్ అయ్యేందుకు వైఫై సేవలు ఉపయోగపడుతాయని కేంద్రం భావిస్తోంది. వైఫై చౌపాల్ స్కీం కింద ఇప్పటికే దేశంలో 43వేల వైఫై హాట్ స్పాట్స్‌ను ఏర్పాటు చేశారు. వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామ పంచాయితీల్లో ఒక వైఫై హాట్ స్పాట్, 3500 జనాభా ఉన్న పంచాయితీల్లో రెండు హాట్ స్పాట్స్, 7500 జనాభా ఉన్న పంచాయితీల్లో 3 హాట్‌స్పాట్స్, 12వేల జనాభా ఉన్న పంచాయితీల్లో 4 హాట్‌స్పాట్స్, 12వేలు మించి జనాభా ఉన్న పంచాయితీల్లో 5 హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఒక వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటు చేయాలంటే రూ.1.5 లక్షలు ఖర్చవుతుంది.