బిజినెస్

ఈ-కామర్స్ లావాదేవీలపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఇ-కామర్స్ లావాదేవీలు నిర్వహించే సంస్థలపై వచ్చిన అభియోగాలను విచారించే బాధ్యత ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు, ఆర్‌బీఐకు అప్పగించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఈ అభియోగాలపై సరైన రీతిలో దర్యాప్తు చేసే అధికారం ఈ రెండు సంస్థలకు ఉందని ఆయన చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాలను అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ సంస్థ ఉల్లంఘించిందని ఆరెస్సెస్‌కు చెందిన స్వదేశీ జాగరణ్ మంచ్ చేసిన ఆరోపణలపై ఆయన మాట్లడుతూ పై విధంగా అన్నారు. శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ, వాల్‌మార్ట్ ఇదే రీతిలో ఫ్లిప్‌కార్ట్‌లో కూడా వాటాలను టేకోవర్ చేసిందన్నారు. ట్రేడర్స్ సంస్థ కైట్ కూడా వాల్‌మార్ట్‌పై కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ కార్యదర్శి రమేష్ అభిషేక్ మాట్లాడుతూ వాణిజ్య శాఖ ఒక విధానాన్ని ఖరారు చేస్తే, ఫెమా చట్టం కింద ఆర్‌బీఐ, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ సంస్థ నోటిఫై చేస్తాయన్నారు. ఈ కామర్స్, ఎఫ్‌డిఐ పాలసీ కింద మార్కెట్ ప్లేస్ మోడల్‌ను మాత్రమే అనుమతిస్తామన్నారు.
గత నెలలో వాల్ మార్ట్ అనే సంస్థ ఫ్లిప్‌కార్డ్‌కు చెందిన 77 శాతం వాటాలను రూ.1.05 లక్షల కోట్లతో టేకోవర్ చేసిన సంగతి విదితమే. దీనివల్ల వచ్చే పదేళ్లలో భారత్‌లో 200 బిలియన్ డాలర్ల మార్కెట్‌పై వాల్‌మార్ట్ పట్టుసాధిస్తుందన్నారు. భారత్‌లో చిల్లర వర్తక లావాదేవీలను వాల్‌మార్ట్ నియంత్రిస్తుందని దేశీయ వర్తకులు ఆరోపిస్తున్న సంగతి విదితమే.