బిజినెస్

బ్యాంకుల బలోపేతానికి ఏఆర్‌సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి, జూన్ 8: బ్యాంకులను పటిష్టం చేసేందుకు అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీని (ఏఆర్‌సి) ఏర్పాటు చేయడంపై సిఫార్సులు చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నామని, రెండు వారాల్లో ఈ కమిటీ నివేదిక ఇస్తుందని ఆర్థిక శాఖమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శుక్రవారం ఆయన జాతీయ బ్యాంకుల చైర్మన్లతో సమావేశమై బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సునీల్ మెహతా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్యాంకు అకౌంట్లను అధ్యయనం చేసేందుకు అసెట్ మేనేజిమెంట్ కంపెనీని ఏర్పాటుచేసే విషయమై ఈ కమిటీ వేగవంతంగా సిఫార్సులు చేస్తుందన్నారు. బ్యాంకు అకౌంట్లను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు.
బ్యాంకులు సక్రమంగా రుణాలు చెల్లించే వారికి రుణాలు ఇవ్వడంలో జాప్యం చేయరాదన్నారు. రుణాల మంజూరు విధానం తీరును ఆయన సమీక్షించారు. వచ్చే 30 రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో కీలకమైన పోస్టుల భర్తీని పూర్తి చేస్తామన్నారు. బ్యాంకుల్లో పాలనా విధానాన్ని పటిష్టం చేయడం, మొండిబకాయిలను రాబట్టుకోవడం అంశాలపై చర్చించినట్లు మంత్రి చెప్పారు. కస్టమర్ల ప్రయోజనాలను కాపాడి, బ్యాంకులను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.