బిజినెస్

లాభాల వైపు మదుపరుల చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు బాగా బలపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో స్వల్పంగా నష్టపోయాయి. ఇంధన, లోహ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 19 పాయింట్లు పడిపోయి, 35,443.67 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ అతి స్వల్పంగా 0.70 పాయింట్లు తగ్గి 10,767.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. కీలకమయిన జీ-7 దేశాల సమావేశం జరుగనున్న తరుణంలో ప్రపంచ వాణిజ్య సంబంధాలలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. యూరోపియన్ మార్కెట్లు, ఆసియన్ మార్కెట్ల కీలక సూచీలు పడిపోయాయి. సెనె్సక్స్ శుక్రవారం ఉదయం దిగువ స్థాయి వద్ద ప్రారంభమయి, సెషన్‌లో అధిక భాగం ప్రతికూల జోన్‌లోనే కొనసాగింది. ఇంట్రా-డేలో ఒక దశలో 35,260 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే సెషన్ ముగిసే దశకు వచ్చిన సమయంలో కోలుకున్న ఈ సూచీ ఇంట్రా-డేలో 35,484.94 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 19.41 పాయింట్ల (0.05 శాతం) దిగువన 35,443.67 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు వెలువడిన తరువాత ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 559.87 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ శుక్రవారం క్రితం ముగింపుతో పోలిస్తే అత్యల్పంగా 0.70 పాయింట్ల (0.01 శాతం) దిగువన 10,767.65 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఇంట్రా-డేలో ఈ సూచీ 10,709.05- 10,779.45 పాయింట్ల మధ్య కదలాడింది. అయితే, ఈ రెండు కీలక సూచీలు కూడా వారం రీత్యా చూస్తే వరుసగా మూడో వారం లాభపడ్డాయి. ఈ వారంలో సెనె్సక్స్ 216.41 పాయింట్లు (0.61 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 71.45 (0.67 శాతం) పెరిగింది. ఇదిలా ఉండగా, గురువారం నాటి లావాదేవీలలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 525.40 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 1,197.89 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సన్ ఫార్మా శుక్రవారం అత్యధికంగా 8.13 శాతం లాభపడింది. డాక్టర్ రెడ్డీస్ 4.92 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థలలో అరబిందో ఫార్మా, లుపిన్, కాడిలా హెల్త్‌కేర్, గ్లెన్‌మార్క్ ఫార్మా ఉన్నాయి. మరోవైపు, సెనె్సక్స్ ప్యాక్‌లోని పవర్ గ్రిడ్ అత్యధికంగా 2.12 శాతం నష్టపోయింది. నష్టపోయిన ఇతర సంస్థలలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఐటీసీ, ఆసియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి.