బిజినెస్

గ్రూప్-7 దేశాల కూటమిలో రష్యాను చేర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లా మాల్బై (కెనడా), జూన్ 9: గ్రూపు-7 దేశాల కూటమిలో రష్యా దేశాన్ని కలుపుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇక్కడ జరిగిన గ్రూపు-7దేశాధినేతల సదస్సులో ఆయన మాట్లాడుతూ రష్యాను చేర్చుకునే విషయమై గ్రూప్-7 దేశాలు ఆలోచించాలని కోరారు. 2014లో క్రెమియాను రష్యా సేనలు ఆక్రమించినందుకు ఆ దేశాన్ని గ్రూప్-7 దేశాల కూటమి నుంచి తొలగించారు. ఇతర దేశాలు వాణిజ్య విధానంలో అమెరికా సరళీకృత విధానాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయన్నారు. గ్రూప్-7 దేశాల కూటమిని విస్తరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన సింగపూర్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో జరిగే భేటీలో పాల్గొనాలనే ఉత్సాహంతో ట్రంప్ కనపడ్డారు. ఈ సదస్సు జరుగుతున్నంత సేపు ట్రంప్ చతురతతో మాట్లాడారు. వాణిజ్యవిధానాల్లో మార్పులు తెచ్చేందుకు ఈ కూటమిలోని దేశాలైన కెనెడా, ఫ్రాన్స, ఇటలీ, జపాన్, జర్మనీ, బ్రిటన్ దేశాలు సహకరించాలని ఆయన కోరారు. కెనెడా, మెక్సికోతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలనే యోచనతో ఉన్నట్లు ఆయన చెప్పారు. కెనెడా విదేశాంగ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ మాట్లాడుతూ జి-7 దేశాల కూటమిలో రష్యాను తిరిగి చేర్చుకునే ప్రతిపాదన ఏదీ లేదన్నారు. గ్రూప్-7 దేశాధినేతల సదస్సు ఇక్కడ సెయింట్ లారెన్స్ నదీ తీరంలో జరగింది. ఈ సదస్సులో జరిగిన చర్చల ఆధారంగా ద్వైపాక్షిక ఒప్పందాలను ఖరారు చేస్తామని వైట్ హౌస్ ప్రతినిధి సారహ్ హక్‌బీ సాండర్స్ చెప్పారు. ఈ సదస్సులో కాలుష్య రహిత ఇంధనం, సముద్ర తీరాల పరిరక్షణ, భూతాపం నుంచి ధరిత్రిని కాపాడుకోవడం అంశాలపై చర్చ జరిగింది.