బిజినెస్

ఊగిసలాడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 11: అంతర్జాతీయ పరిణామాలు, ఇతర అంశాలు సోమవారం భారత స్టాక్ మార్కెట్ లావాదేవీలపై మిశ్రమ ప్రభావం కనబరిచాయి. వీటి ఫలితంగా వివిధ దశల్లో ఊగిసలాడిన మార్కెట్లు స్వల్ప లాభంతో ముగిశాయి. ఒకపక్క జీ-7 పారిశ్రామిక దేశాల శిఖరాగ్ర సదస్సు, మరోవైపు అమెరికా-ఉత్తర కొరియా శిఖరాగ్ర భేటీ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఊగిసలాడాయి. ఒక దశలో 232 పాయింట్లు పుంజుకున్న సెనె్సక్స్ చివరికి కేవలం 39.80 పాయింట్ల అధిక్యతతో 35,483.47 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 19.30 పాయింట్లు పుంజుకుని 10,786.95 వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో టెలికాం, వినియోగ వస్తువులు, హెల్త్‌కేర్ రంగంలోని సంస్థల షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంపై కూడా మదుపరులు ఆసక్తిని కనబరిచారు. ముఖ్యంగా రాని బాకీ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక ప్యానల్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇనె్వస్టర్లలో సానుకూలత లభించింది. కాగా ఋతుపవనాలు సకాలంలో రావడం, గ్రామీణ వ్యవస్థ పుంజుకునే అవకాశాలు మెరుగుపడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్ మరింతగా బలపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. స్వల్ప లాభాలతో ముగిసిన నేటి లావాదేవీల్లో టెలికాం రంగం షేర్లు 1.56, వినియోగ వస్తువుల కంపెనీల షేర్లు 1.03, హెల్త్‌కేర్ 0.51, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు 0.37 శాతం మేర పుంజుకున్నాయి. అలాగే ఐటీ, ఆటో, బ్యాంకెక్స్ షేర్లు కూడా స్వల్పంగా లాభపడ్డాయి. అన్నింటికంటే ఎక్కువగా భారతి ఎయిర్ టెల్ షేర్ విలువ 3.19 శాతం మేర పెరిగింది. ద్వితీయ స్థానంలో సన్‌ఫార్మా, తృతీయ స్థానంలో డాక్టర్ రెడ్డీస్, అనంతర స్థానాల్లో మారుతి సుజుకి, ఇండస్‌ఇండ్, అదానీ పోర్ట్స్ మొదలైనవి ఉన్నాయి. నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, హీరో మోటార్స్, ఎస్‌బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మొదలైన షేర్లున్నాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.