బిజినెస్

శ్రీసిటీలో మరో పరిశ్రమకు భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ/వరదయ్యపాళెం, జూన్ 14: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ పారిశ్రామిక వాడలో వైండింగ్ వైర్ల తయారీ సంస్థ జి.కె వైండింగ్ లిమిటెడ్ నూతన ఉత్పత్తికేంద్రం నిర్మాణానికి గురువారం శ్రీసిటీలో భూమిపూజ చేశారు. ఈ సంస్థ నోయిడా ప్రధాన కేంద్రంగా 1975వ సంవత్సరంలో స్థాపితమైంది. ఈ సంస్థకు ఉత్తర భారతదేశంలో ఇప్పటికే 3 ఉత్పత్తికేంద్రాలు ఉన్నాయి. ఈ భూమి పూజ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ అగర్వాల్ మాట్లాడుతూ సులభతర వ్యాపార నిర్వహణ, యాజమాన్యం ప్రోత్సాహక ధోరణి వలన తమ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీసిటీని ఎంచుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా మరో ప్రధానకారణమని తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సంస్థ టర్నోవర్ రూ.410 కోట్లు అని, దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ వైండింగ్ వైర్‌ల తయారీలో పేరుగాంచిన ఈసంస్థ ఉత్పత్తులు శ్రీసిటీ పరిశ్రమలతో పాటు చెన్నై పరిసర పరిశ్రమలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
శ్రీసిటీ డీటీజడ్ ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.35కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. 2019 మార్చి నాటికి పూర్తికానున్న ఈ పరిశ్రమలో సుమారు 100మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.