బిజినెస్

మూడు రోజుల లాభాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 14: దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల లాభాలకు తెరపడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం గురువారం స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో పాటు మే నెలలో టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయిలో 4.43 శాతం నమోదు కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కరెంటు ఖాతా లోటు (సీఏడీ) మూడింతలకు (1.9 శాతం) పైగా 48.7 బిలియన్ డాలర్లకు పెరగడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం 139 పాయింట్లు పడిపోయి 35,599.82 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 48.65 పాయింట్లు తగ్గి 10,808.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం తన కీలక వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచిన తరువాత ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నిస్తేజం అలుముకుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం ఈ సంవత్సరం ఇది రెండోసారి.
ఈ సంవత్సరం మరో రెండుసార్లు, వచ్చే సంవత్సరం నాలుగుసార్లు వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు కూడా ఈ వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల వెలువడ్డాయి. ఐరోపా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య విధాన నిర్ణయాల కోసం కూడా మదుపరులు వేచిచూస్తున్నారు.
సెనె్సక్స్ గురువారం కాస్త మెరుగ్గా ప్రారంభమయి, మరింత ముందుకు సాగుతూ 35,749.88 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, ఇతర ఆసియా మార్కెట్లలో బలహీన ధోరణి నెలకొనడంతో దాని ప్రతికూల ప్రభావం కారణంగా పడిపోవడం ప్రారంభించింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 139.34 పాయింట్ల (0.39 శాతం) దిగువన, 35,599.82 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం మూడు సెషన్లలో కలిసి 295.49 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ కూడా గురువారం 48.65 పాయింట్లు (0.45 శాతం) తగ్గి, 10,808.05 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,773.55- 10,833.70 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం నికరంగా రూ. 70.77 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 486.78 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థలలో ఐసీఐసీఐ బ్యాంక్ గురువారం అత్యధికంగా 2.11 శాతం నష్టపోయింది. టీసీఎస్ 1.75 శాతం నష్టంతో రెండో స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థలలో అదాని పోర్ట్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, విప్రో, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ ఉన్నాయి. మరోవైపు సన్ ఫార్మా 2.57 శాతం లాభపడింది. యెస్ బ్యాంక్ 1.17 శాతం లాభంతో తరువాత స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థలలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, రిల్, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్ ఉన్నాయి.