బిజినెస్

జనరల్ మోటార్స్ సీఎఫ్‌ఓగా ఇండియన్ అమెరికన్ మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్ట్టన్, జూన్ 14: అమెరికాలో అతిపెద్ద మోటారు వాహనాల తయారీ కంపెనీ, జనరల్ మోటార్స్ (జీఎం)కు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా ఇండియన్-అమెరికన్ మహిళ దివ్య సూర్యదేవర నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కార్పొరేట్ ఫైనాన్స్‌కు వైస్-ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సంస్థకు సీఎఫ్‌ఓగా వ్యవహరిస్తున్న ఛుక్ స్టీవెన్స్ పదవీ విరమణ చేస్తుండటంతో వచ్చే సెప్టెంబర్ 1నుంచి దివ్య సూర్యదేవర బాధ్యతలు స్వీకరిస్తారు. చెన్నైలో జన్మించిన సూర్యదేవర 2017, జూలై నుచి జీఎం కార్పొరేట్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 2014 నుంచి సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్న మేరీ బర్రాకు, ఈమె రిపోర్ట్ చేస్తారు. ఆటో పరిశ్రమలో అత్యున్నత స్థానాలను అధిరోహించిన తొలి మహిళలు బర్రా, దివ్య సూర్యదేవర.