బిజినెస్

వాణిజ్య లోటు 14.62 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: భారత్ వాణిజ్య లోటు నాలుగు నెలల కాలంలో గరిష్టంగా 14.62 బిలియన్ డాలర్లకు చేరుకుందని, దిగుమతులు 15 శాతం పెరిగాయని కేంద్రం తెలిపింది. ఎగుమతులు మే నెలలో 28.18 శాతం పెరిగాయని, వీటివిలువ 28.86 బిలియన్ డాలర్లకు చేరుకుందన్నారు. దిగుమతులు 14.85 శాతం పెరిగాయని, వీటివిలువ 43.48 డాలర్లకు చేరుకుందన్నారు. వాణిజ్య లోటను విశే్లషిస్తే గత ఏడాది మే నెలలో 13.84 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఈ ఏడాది మే నెలకు 14.62 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. చమురు దిగుమతులు 49.46 శాతం పెరిగాయి. వీటివిలువ 11.5 బిలియన్ డాలర్లు. కాగా బంగారం దిగుమతులు 16.6 శాతం పెరిగాయి. వీటివ ఇలువ 1.18 బిలియన్ డాలర్లుగా నమోదైందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.