బిజినెస్

సౌర విద్యుత్ ప్రాజెక్టులకు 100 కోట్ల డాలర్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు తోడ్పాటును అందించేందుకు 100 కోట్ల డాలర్ల (దాదాపు 6,750 కోట్ల రూపాయల) రుణాన్ని అందజేస్తామని ప్రపంచ బ్యాంకు హామీ ఇచ్చింది. గురువారం న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం పియూష్ గోయెల్ మాట్లాడుతూ, దేశంలో పునర్వినియోగ ఇంధన వనరుల అభివృద్ధి గురించి ప్రత్యేకించి రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో చర్చించామన్నారు. 2022 నాటికి లక్ష మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న మన దేశం ఈ లక్ష్య సాధన కోసం వివిధ మార్గాల ద్వారా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం విదితమే.