బిజినెస్

ఆయుష్మాన్ క్లెయమ్స్‌కు 15 రోజులే గడువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయూష్మాన్ భారత్ నేషనల్ ఆరోగ్య బీమా పథకం కింద త్వరితగతిన క్లైమ్‌లను పరిష్కరించడంలో జాప్యం చేసే బీమా కంపెనీలపై పెనాల్టీలను విధించనున్నారు. ఈ ప్రతిపాదనను కేంద్రం చురుకుగా పరిశీలిస్తోంది. 15 రోజుల్లోగా క్లైమ్‌ను పరిష్కరించని పక్షంలో, క్లైమ్ సొమ్ముపై వారానికి ఒక శాతం చొప్పున పెనాల్టీని విధిస్తారు. క్లైమ్ పరిష్కరించేంత వరకు పెనాల్టీని కొనసాగిస్తారు. బీమా కంపెనీలు ఆసుపత్రులకు ఈ క్లైమ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ముసాయిదా ప్రతిపాదనల డాక్యుమెంట్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్‌లో ఏ స్కీం కింద ఎంత చెల్లించాలనే నిబంధనల వివరాలు ఉన్నాయి. ఈ స్కీం అమలుకు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ముందుకు వచ్చాయి. ఈ రాష్ట్రాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశంలో పది కోట్ల మందికి ఈ స్కీం వర్తిస్తుంది. కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తారు. ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఇంతవరకు ఈ విషయమై తమ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియచేయలేదు. ఈ రాష్ట్రాలతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఈ స్కీంను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ స్కీం ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకంగా రికార్డు సృష్టించనుంది. ప్రపంచ ఆరోగ్య బీమా చిత్రపటంలో భారత్‌కు సముచిత స్థానం లభిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. ఈ స్కీంను గ్రామీణ పేదలు, వైద్య సదుపాయాలకు నోచుకోని గ్రామీణ కుటుంబాలు, పట్టణాల్లో పేద కార్మికులకు వర్తింప చేయనున్నారు. గ్రామీణప్రాంతాల్లోల 8.03 కోట్ల మందికి, పట్టణ ప్రాంతాల్లో 2.33 కోట్ల మందికి ఈ స్కీంను అమలు చేస్తారు. ఏతావాతా ఈ స్కీం పరిధిలోకి 50 కోట్ల మంది భారతీయులు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీంను బీమా కంపెనీలు లేదా ట్రస్టులు లేదా సొసైటీల ద్వారా అమలు చేసేందుకు కేంద్రం అనుమతిస్తుంది. కేంద్రం 2018-19, 2019-20 బడ్జెట్‌లో ఈ స్కీం అమలుకు రూ.10వేల కోట్ల నిధులను కేటాయించింది.