బిజినెస్

ఈశాన్య రాష్ట్రాలకు పెరిగిన పర్యాటకుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి, జూన్ 17: నిన్న మొన్నటి వరకు వెనకబడిన ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం వౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం, ఎయిర్ కనెక్టివిటీని పెంచడంతో పర్యాటకుల సంఖ్య పెరిగింది. పర్యాటకుల సంఖ్యలో ఈ ఏడాది కూడా 10 నుంచి 12 శాతం వృద్ధిరేటునమోదవుతుందని కాక్స్ కింగ్స్ హెడ్ రిలేషన్ షిప్స్ ప్రతినిధి కరణ్ ఆనంద్ చెప్పారు. ఎతె్తైన కొండలు, అందమైన జలపాతాలలో ఈశాన్య రాష్ట్రాలు అలరారుతున్నాయని, బుకింగ్స్ గత ఏడాదితో పోల్చితే 18 శాతం పెరిగినట్లు ఆయన చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు ఏడు ఉన్నాయని, ఎయిర్ కనెక్టివిటీ పెరగడం వల్ల పర్యాటకులు సందర్శనకు ఆసక్తి కనపరుస్తున్నారన్నారు. షిల్లాంగ్ హబ్‌గా ఎయిర్ కనెక్టివిటీని పెంచారన్నారు. సిక్కింలో పక్యాంగ్‌లో కొత్త విమానాశ్రయం నిర్మాణమవుతోంది. సిక్కింలో నాథూలా పాస్‌ను సందర్శించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. 25 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వారు హాలిడే రోజుల్లో ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలకువస్తున్నారు. ఢిల్లీ, ముంబాయి, కోల్‌కొతా నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అడవులు, నదులు లాంటి సహజ ప్రకృతి వనరులు తిలకించేందుకు, సంస్కృతిని చూసేందుకు పర్యాటకులు మక్కువ చూపిస్తున్నారు. మేక్‌మై ట్రిప్ ప్రతినిధి మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ పెరిగిందన్నారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో పర్యాటక ప్యాకేజీలు ఆఫర్ చేసే సంస్థలు పెరిగాయి. గ్యాంగ్‌టక్‌కు ట్రావెల్ బుకింగ్స్ 30శాతం పెరిగాయి. కాగా షిల్లాంగ్‌కు అయితే బుకింగ్స్ ఎకాఎకిన 120 శాతం పెరిగాయి. ప్యాకేజీల్లో భాగంగా ఉల్లాసకరమైన క్రీడలను పర్యాటక ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు.