బిజినెస్

నళినీ చిదంబరానికి మళ్లీ ఈడీ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: శారదా పోంజీ మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సతీమణి నళినీ చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీచేసింది. ఆమె జూన్ 20న కోల్‌కతాలోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. గత మే 7న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ సీనియర్ అడ్వకేట్ అయిన నళినీ చిదంబరం మద్రాసు హైకోర్టులో సవాలు చేశారు. అంతకుముందు ఈడీ సమన్లను సవాలు చేస్తూ నళిని దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 24న జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం డిస్మిస్ చేశారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద మహిళను తానున్న ప్రదేశంలో కాకుండా మరో ప్రదేశంలో విచారణకు రావాలని సమన్లు జారీ చేయడం విరుద్ధమన్న ఆమె వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఒక కేసులో పరిస్థితులు, వాస్తవాల నేపథ్యంలో ఇటువంటి మినహాయింపులు తప్పనిసరి కావని పేర్కొంటూ, మళ్లీ సమన్లు జారీ చేయాల్సిందిగా ఈడీని ఆదేశించారు. దీంతో మే 7న విచారణకు హాజరు కావాలంటూ ఏప్రిల్ 30న ఈడీ నళినికి మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని ఈడీ పేర్కొంది. 2016, సెప్టెంబర్ 7న ఈడీ మొదటిసారి నళినికి సమన్లు జారీ చేసింది. శారదా చిట్‌ఫండ్ స్కాంలో సాక్షిగా ఆమెను కోల్‌కతా కార్యాలయానికి హాజరు కావాలని కోరింది. టెలివిజన్ ఛానల్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కోర్టు, కంపెనీ లా బోర్డు ఎదుట హాజరైనందుకు లీగల్ ఫీజు కింద రూ.1.26 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి గతంలో ఈడీ, సీబీఐ సంస్థలు ఆమెను ప్రశ్నించాయి.