బిజినెస్

ఎస్‌ఈజెడ్ ఎగుమతులలో 38శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 21: దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజెడ్‌ల) నుంచి ఎగుమతులు మే నెలలో 38 శాతం పెరుగుదలతో రూ. 29,236 కోట్లకు చేరుకున్నాయి. ఎగుమతుల పెరుగుదలకు దోహదపడిన ప్రధాన రంగాలలో బయోటెక్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, నాన్ కనె్వన్షనల్ ఎనర్జీ, ప్లాస్టిక్, రబ్బర్, ట్రేడింగ్ సర్వీసులు ఉన్నాయని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ ఈఓయూస్ అండ్ సెజ్స్ (ఈపీసీఈఎస్) తెలిపింది. ఏప్రిల్, మే రెండు నెలల కాలంలో ఈ జోన్ల నుంచి ఎగుమతులు 11 శాతం పెరుగుదలతో రూ. 1.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ‘ఎస్‌ఈజెడ్‌ల నుంచి ఎగుమతులలో ఆరోగ్యకర స్థాయిలో నమోదయిన వృద్ధి రేటు మరోసారి ఈ జోన్ల ఆర్థిక ప్రభావం పెరుగుదలను, దేశ ఎగుమతుల ఆదాయంలో ఈ జోన్లు నిర్వహిస్తున్న పాత్రను ప్రతిబింబించాయి’ అని ఈపీసీఈఎస్ చైర్మన్ వినయ్ శర్మ పేర్కొన్నారు. భారత్ ఎస్‌ఈజెడ్‌ల నుంచి ప్రధానంగా ఎగుమతి అయిన దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏ ఈ), అమెరికా, సౌదీ అరేబియా ఉ న్నాయి. అయితే, హాంకాంగ్, ఆఫ్రికా, కెన్యా, ఒమన్ ప్రాంతాలకు ఎగుమతుల విషయంలో ప్రతికూల ధోరణి కనిపించింది. భారత్ ఎస్‌ఈజెడ్‌ల నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం లో ఎగుమతులు 15 శాతం వృద్ధితో 5.52 లక్షల కోట్లకు చేరుకున్నాయి.