బిజినెస్

పెరిగిన ముడి చమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 22: పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) చమురు ఉత్పత్తులను పెంచే అంశంపై ఒక ఒప్పందానికి రావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక శాతం పెరిగాయి. ప్రధానమయిన బ్రెంట్ క్రూడ్ ధర అంతర్జాతీయ కాలమానం ప్రకారం 0925 గంటలకు బారెల్‌కు 1.05 డాలర్లు పెరిగి 74.10 డాలర్లకు చేరింది. అమెరికా లైట్ ముడి చమురు ధర 80 సెంట్లు అధికంగా 66.34 డాలర్లకు చేరింది. చమురు ఉత్పత్తి విధానంపై చర్చించేందుకు ఒపెక్‌యేతర చమురు ఉత్పత్తి దేశాలతో కలిసి ఒపెక్ దేశాలు వియన్నాలో సమావేశమయ్యాయి. సౌదీ అరేబియా, రష్యా చమురు ఉత్పత్తిని పెంచాలని కోరుతుండగా, ఇరాన్ సహా మరికొన్ని ఒపెక్ దేశాలు వ్యతిరేకించాయి.