బిజినెస్

లక్నోలో మామిడి పండ్ల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 23: పండ్లలో రారాజు ఎవరంటే మామిడిపండే. ఇలాంటివి 700 రకాల మామిడి పండ్లు ఒక్కచోట చేరితో ఎలా వుంటుంది. వాటిని చూసినవారు లొట్టలు వేయాల్సిందే. లక్నోలో రెండు రోజులపాటు నిర్వహించనున్న మామిడి పండ్ల ప్రదర్శనలో దాదాపు 700 రకాల మామిడి పండ్లు దర్శనమిచ్చాయి. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే ‘యోగి’ మామిడి పండు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరుమీద కొత్తరకం మామిడి పండును ఇక్కడ ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను శనివారం ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మామిడి పండ్ల ఉత్పత్తిలో యూపీ అగ్రస్థానంలో వుందని, ఉద్యానవన పంటల ద్వారా రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చునని అన్నారు.
ఇలాంటి ప్రదర్శనల ద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చునని అన్నారు. ఉత్తరాఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది రైతులు తమ పండ్లను ఇక్కడ ప్రదర్శించారు. షహరాన్‌పూర్ నుంచి ‘యోగి’ పేరుతో తీసుకువచ్చిన పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండ్ల పెంపకంలో మెళకువలు, చీడపీడల నివారణకు తగిన సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఇక్కడ సెమినార్లు సైతం నిర్వహించనున్నారు.