బిజినెస్

భారతి ఇన్‌ఫ్రాటెల్ సీఎఫ్‌ఓగా బాలసుబ్రమణియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: మొబైల్ టవర్ సంస్థ భారతి ఇన్‌ఫ్రాటెల్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ)గా ఎస్.బాలసుబ్రమణియన్ నియమితులయ్యారు. ఆగస్టు 10వ తేదీన ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారని ఆ కంపెనీ శనివారం తెలిపింది. ప్రస్తుతం భారతి ఇన్‌ఫ్రాటెల్ సీఎఫ్‌ఓగా ఉన్న పంకజ్ మిగ్లానీ నుంచి బాలసుబ్రమణియన్ బాధ్యతలు స్వీకరిస్తారు. పంకజ్ మిగ్లానీ భారతి గ్రూప్‌లోనే ఇతర బాధ్యతలు స్వీకరించనున్నారు. ‘పంకజ్ మిగ్లానీ ఆగస్టు 9వ తేదీన కార్యాలయ పనివేళలు ముగిసిన తరువాత సీఎఫ్‌ఓ పదవి నుంచి తప్పుకుంటారు. భారతి గ్రూప్‌లోనే ఆయన ఇతర బాధ్యతలు నిర్వహిస్తారు’ అని భారతి ఇన్‌ఫ్రాటెల్ బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన ఒక పత్రంలో పేర్కొంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు జూన్ 22నాటి సమావేశంలో బాలసుబ్రమణియన్‌ను కంపెనీ సీఎఫ్‌ఓ, కీ మేనేజరియల్ పర్సనల్ (కేఎంపీ)గా నియమించినట్లు, ఈ నియామకం ఆగస్టు 10వ తేదీనుంచి అమలులోకి వస్తుందని భారతి ఇన్‌ఫ్రాటెల్ వివరించింది.