బిజినెస్

వౌలిక వసతుల కల్పన పెద్ద సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 25: దేశంలో రాబోయే దశాబ్దకాలంలో వౌలిక సదుపాయాల కల్పనకు 4.5 ట్రిలియన్ యుఎస్ డాలర్లు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సోమవారం వెల్లడించారు. నిజానికి ఇది ఎంతో సవాలైనప్పటికీ, దేశానికి అవసరమైన ఈ నిధులకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆసియా వౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంక్ (ఏఐఐబీ) రెండు రోజుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, ఇంతటి స్థాయిలో వౌలిక సదుపాయాలు కల్పిస్తే, దేశంలోకి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వెల్లువెత్తుతాయన్నారు. ఈ నిధులకోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా వడ్డీరేట్లు పెరగడం, యుఎస్‌లో రేట్లు మరింత కఠినతరం అవుతున్న నేపథ్యంలో ఆర్థికం అనేది అతిముఖ్యమైన సవాలు అని అన్నారు. పెద్ద వౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్వహణకు సామర్ధ్య నిర్మాణం కూడా పెద్ద సవాలేనన్నారు. ఈ రెండు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏఐఐబీ వంటి సంస్థలు సహాయం చేస్తాయని ఆశిస్తున్నానన్నారు. అయితే సింగపూర్‌కు చెందిన డీబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీయూష్ గుప్తా మాట్లాడుతూ, ఇంత పెద్దమొత్తంలో వౌలిక సదుపాయాలకోసం సంప్రదాయిక బ్యాంకులకు నిధులు సమకూర్చే సామర్థ్యం పరిమితమన్నారు. అందువల్ల బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణ మాత్రమే ఇందుకు సరైన పరిష్కారమని సూచించారు. అయితే బాండ్ మార్కెట్లు కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటుండటం వల్ల గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు మద్దతిచ్చే సామర్థ్యం పరిమితమన్నారు. ఇదిలావుండగా మంత్రి గోయల్ మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో జపాన్‌కు చెందిన ‘జికా’ సంస్థ పెట్టుబడులు పెట్టిన అంశాన్ని గుర్తు చేశారు. భారత్‌లో ధనం సురక్షితమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయంగా తీసుకున్న రుణాల విషయంలో ఒక్కసారికూడా డిఫాల్ట్ కాలేదన్న సంగతి గుర్తు చేశారు.