బిజినెస్

108 రోడ్లకు రూ. 274 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 28: గ్రామీణ రోడ్ల అనుసంధాన ప్రాజెక్టు కింద రహదార్ల నిర్మాణానికి నాబార్డు రుణసహాయం అందించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 108 రోడ్లకు 274 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అనేక కొత్త రోడ్లతో ప్రజలకు దగ్గరలోని మార్కెట్లతో అనుసంధానం మెరుగు పడటంతో పాటు విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలకు చేరుకోవటం మరింత సులభతరమవుతుందని నాబార్డు ఏపీ ప్రాంతీయ కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ కె సురేశ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 463.13 కిలోమీటర్ల తారురోడ్లు ఏర్పాటవుతాయని, 529 గ్రామాల్లో అనుసంధానం ద్వారా 18 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో 224 మార్కెట్ యార్డుల ద్వారా తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు రైతులకు వీలుగా ఉంటుందన్నారు. ఈ ఏడాది మరిన్ని రోడ్డు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.