బిజినెస్

వివరాలు వెల్లడించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు లేదా సంస్థల వివరాలను వెల్లడించడం సాధ్యం కాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) స్పష్టం చేసింది. వెంకటేశ్ నాయక్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి మాసంలో 222 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఎస్‌బీఐ అమ్మింది. ఏప్రిల్‌లో ఇది 114.9 కోట్ల రూపాయలకు తగ్గింది. న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లోనే అత్యధికంగా 122 కోట్ల రూపాయల విలువైన బాండ్లను అమ్మినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ బ్రాంచ్‌లో ఏప్రిల్‌లో అమ్ముడైన బాండ్ల విలువ 53 కోట్ల రూపాయలు. కాగా, ఇంత భారీగా బాండ్ల విక్రయాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన వెంకటేశ్ నాయక్, వీటిని ఎవరెవరికి అమ్మారో తెలపాల్సిందిగా కోరుతో ఆర్‌టీఐ మాధ్యమంగా కోరారు. అయితే, వివరాలు అందించేందుకు ఎస్‌బీఐ నిరాకరించింది. బాండ్ల కొనుగోలుదారుల వివరాలను వెల్లడించడం బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని తేల్చిచెప్పింది. భారత రిజర్వ్ బ్యాంక్ 2015లో విడుదల చేసిన సర్యులర్‌లోని 25వ పేరాలోని అంశాలను పరిశీలిస్తే, బాండ్లను కొన్న వారి వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వెల్లడించడానికి వీల్లేదని వివరించింది. ఖాతాదారులతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, వాటికి భంగం వాటిల్లే ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోమని స్పష్టం చేసింది.