బిజినెస్

ఎల్‌ఐసీ పెట్టుబడులపై ఎలాంటి చర్చ జరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఐడీబీఐ బ్యాంకులో రూ. 13,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అంశంపై రెండు సంస్థల మధ్య ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగలేదని ఐడీబీఐ బ్యాంకు శుక్రవారం స్పష్టం చేసింది. ఐడీబీఐలో రూ. 13,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎల్‌ఐసీ కసరత్తు చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై ఐడీబీఐ శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజ్‌లకు వివరణ ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ బోర్డులో ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని కూడా వెల్లడించింది. ఐడీబీఐలో ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినా లేదా బ్యాంకు బోర్డులో చర్చ జరిగినా సెబీ నిబంధనలకు అనుగుణంగా వెంటనే ఆ అంశాన్ని స్టాక్ ఎక్స్చేంజ్‌లకు తెలియజేస్తామని కూడా ఐడీబీఐ పేర్కొంది. గణనీయమయిన సంఖ్యలో ఐడీబీఐ వాటాలను కొనుగోలు చేయాలన్న ఎల్‌ఐసీ ప్రతిపాదనను బీమా కంపెనీల నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ) ఆమోదించవచ్చని వార్తలు వచ్చిన నేపథ్యంలో స్టాక్ ఎక్స్చేంజీలకు ఐడీబీఐ ఈ వివరణ ఇచ్చింది. ఐడీబీఐలోని మెజారిటీ వాటాలను చేజిక్కించుకోవడం ద్వారా బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టడానికి ఎల్‌ఐసీ చూస్తోందని పారిశ్రామిక, ప్రభుత్వ వర్గాలు గురువారం వెల్లడించాయి.
పుంజుకున్న ఐడీబీఐ షేర్ విలువ
నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏల) భారంతో సతమతం అవుతున్న ఐడీబీఐ బ్యాంకులోని మెజారిటీ వాటాలను ఎల్‌ఐసీ స్వాధీనం చేసుకుంటుందని వచ్చిన వార్తల ఫలితంగా శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో ఐడీబీఐ బ్యాంక్ షేర్ విలువ పది శాతానికి పైగా పుంజుకుంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో ఐడీబీఐ షేర్ ధర 10.02 శాతం పెరుగుదలతో రూ. 54.90 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ షేర్ ధర 11.92 శాతం పెరుగుదలతో రూ. 55.85కు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ఐడీబీఐ షేర్ విలువ 10.33 శాతం పెరుగుదలతో రూ. 55 వద్ద ముగిసింది. ఐడీబీఐ షేర్ ధర శుక్రవారం గణనీయంగా పెరగడంతో బ్యాంకు మార్కెట్ విలువ రూ. 7,566.73 కోట్లు పెరిగి, రూ. 22,954,73 కోట్లకు చేరుకుంది.