బిజినెస్

2నుంచి నాలుగో విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో నాలుగో విడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం జూలై రెండున ప్రారంభమవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజకీయ పార్టీలకు, ఇతరులకు నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ ఎలక్టోరల్ బాండ్ల వల్ల వివిధ పార్టీల నిధుల సేకరణలో పారదర్శకత లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఆధ్వర్యంలో జరిగే నాలుగోవిడత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం ఈఏడాది జూలై రెండున ప్రారంభమై జూలై 11న ముగుస్తుందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. దేశంలోని కేవలం 11 నిర్దేశించిన ఎస్‌బిఐ బ్రాంచిలలో మాత్రమే వీటి అమ్మకాలు సాగుతాయి. అవి న్యూఢిల్లీ, గాంధీనగర్, చంఢీగఢ్, బెంగళూరు, భోపాల్, ముంబయి, జైపూర్, లక్నో, కోల్‌కతా, గౌహతి. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఈ ఎలక్టోరల్ బాండ్ల అమ్మకాన్ని ప్రవేశపెట్టింది. భారత్‌కు చెందిన ఏ పౌరుడు, సంస్థ గాని వీటిని కొనుగోలు చేయవచ్చు. అంతకుముందు జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒకశాతం ఓట్లు సాధించిన ఏ రాజకీయ పార్టీకైనా వారు ఈ బాండ్ల రూపంలో విరాళాలు ఇవ్వవచ్చు. కాగా, ఈ ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం మొదటిసారిగా ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి పది, రెండో విడత ఏప్రిల్ రెండు నుంచి పది, మూడో విడత మే ఒకటి నుంచి పదోతేదీ వరకు జరిగాయి. దేశంలో ఒక్క ఎస్‌బిఐ బ్రాంచిల్లో మాత్రమే వీటిని అమ్ముతారు. ఎవరైనా వ్యక్తిగతంగా గాని, భాగస్వామ్యంగా కాని, అలాగే సంస్థలు కాని బాండ్లను కొనుగోలు చేసి ఆయా రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు. అయితే ఈ బాండ్ల కాలపరిమితి కేవలం 15 రోజులు మాత్రమే. అది దాటిన తర్వాత ఈ బాండ్‌కు ఎలాంటి విలువ ఉండదు. ఇవి తీసుకున్న పార్టీలు కాని, సంస్థలు కాని బాండ్లను తమ ఖాతాలో డిపాజిట్ చేయాలి. అదేరోజున వారి ఖాతాలోకి నగదు జమ అవుతుంది.