బిజినెస్

వృద్ధిరేటు పెరగాలంటే మూడు సూత్రాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 29: గరిష్ట స్థాయిలో ఆర్థికాభివృద్ధిరేటును సాధించాలంటే భారత్ మూడు సూత్రాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిది సంస్థ సూచించింది. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తేవాలని, వస్తుసేవాపన్నును సరళీకృతం చేయాలని, ద్రవ్య లోటు తలెత్తకుండా కన్సాలిడేషన్ చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో 7.7 శాతం మేర భారత్ వృద్ధిరేటు సాధించింది. అంతకు ముందు త్రైమాసికం కంటే ఎక్కువగానే వృద్ధిరేటు నమోదైందని ఐఎంఎఫ్ పేర్కొంది. ఈ వివరాలను ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గెర్రీ రైస్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 7.4 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వేగవంతం చేయాలని, ఇచ్చినహామీ మేరకు నిధులను సమకూర్చాలని ఆయన కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల్లో జవాబుదారీతనం, సుపరిపాలన పెంచాలన్నారు. వస్తుసేవా పన్నును మరింత సరళీకృతం చేయాలన్నారు. బ్యాంకింగ్ రంగంలో పోటీతత్వం పెంచాలన్నారు.
ఈ ఏడాది జూలై 18 తేదీన భారత్‌లో సమావేశం కావాలని ఐఎంఎఫ్ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. జీఎస్‌టీ సంక్లిష్టంగా ఉందని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకు అవుట్‌లుక్ వివరాలను వచ్చే నెల 16వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.