బిజినెస్

భారీగా బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 29: రెండు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తిరిగి బలంగా పుంజుకున్నాయి. జూలై నెల డెరివేటివ్‌ల కాంట్రాక్టులు పటిష్ట స్థితిలో ప్రారంభం కావడంతో పాటు రూపాయి పుంజుకోవడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారం భారీగా 386 పాయింట్లు పుంజుకుంది. మే 31న 416.27 పాయింట్లు పుంజుకున్న సెనె్సక్స్ ఆ తరువాత ఒక్క సెషన్‌లోనే ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ శుక్రవారం 125 పాయింట్లు పుంజుకుంది. వాణిజ్య వివాదాలు, అధిక చమురు ధరల వంటి ప్రతికూల అంశాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నప్పటికీ, గత కొంతకాలంగా బలహీనంగా సాగుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తిరిగి బలపడ్డాయి. డాలర్‌తో పోలిస్తే గురువారం సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి తిరిగి పుంజుకోవడంతో మదుపరుల సెంటిమెంట్ బలపడింది. సెనె్సక్స్ శుక్రవారం 35,128.16 పాయింట్ల పటిష్ట స్థాయి వద్ద ప్రారంభమయి, కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెషన్ అంతా సానుకూల ధోరణిలోనే కొనసాగింది. ఒక దశలో ఇంట్రా-డేలో ఈ సూచీ 35,459.05 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే భారీగా 385.84 పాయింట్ల (1.10 శాతం) పైన 35,423.48 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 452.40 పాయింట్లు పడిపోయింది. ఇదే రీతిలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే 125.20 పాయింట్ల (1.18 శాతం) పైన 10,714.30 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,723.05- 10,612.35 పాయింట్ల మధ్య కదలాడింది. అయితే, వారం రీత్యా చూస్తే ఈ రెండు సూచీలు కూడా ఈ వారంలో నష్టపోయాయి. దీంతో వరుసగా అయిదు వారాల లాభాలకు తెరపడింది. సెనె్సక్స్ ఈ వారంలో 266.12 పాయింట్లు (0.75 శాతం), నిఫ్టీ 107.55 పాయింట్లు (0.99 శాతం) చొప్పున పడిపోయాయి. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) గురువారం నికరంగా రూ. 442.64 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) రూ. 951.51 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని టాటా స్టీల్ శుక్రవారం అత్యధికంగా 3.61 శాతం లాభపడింది. యెస్ బ్యాంక్ 3.16 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థలలో రిల్, ఎల్‌అండ్‌టీ, అదాని పోర్ట్స్, ఓఎన్‌జీసీ, వేదాంత లిమిటెడ్, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్, ఐటీసీ లిమిటెడ్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, విప్రో, భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, మారుతి సుజుకి, కోటక్ బ్యాంక్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.99 శాతం వరకు పెరిగింది. మరోవైపు, నష్టపోయిన సంస్థలలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, సన్ ఫార్మా, ఆసియన్ పెయింట్స్ ఉన్నాయి.