బిజినెస్

ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్‌గా చతుర్వేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త నాన్-ఎగ్జిక్యూటివ్ పార్ట్-టైమ్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎంకె శర్మ స్థానంలో 65 ఏళ్ల చతుర్వేది నియమితులయ్యారు. చైర్మన్‌గా శర్మ గడువు జూన్ 30వ తేదీతో ముగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన చతుర్వేది మూడేళ్ల పదవీకాలంతో బ్యాంక్ చైర్మన్‌గా నియమితులయినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ శుక్రవారం వెల్లడించింది. చతుర్వేది జూలై ఒకటో తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. చతుర్వేది 2013 జనవరిలో అఖిల భారత సర్వీస్ నుంచి పదవీవిరమణ పొందారు. ఐసీఐసీఐ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయిందంటే తాను విశ్వసించనని, ఇటీవలి ప్రతికూల సంఘటనల నుంచి బ్యాంకు బయటపడగలదని కొత్తగా చైర్మన్‌గా నియమితులయిన చతుర్వేది పేర్కొన్నారు. కొత్త బాధ్యతల నిర్వహణలో తాను సానుకూలంగా ముందుకు సాగుతానని, అయితే ఈ బాధ్యతల నిర్వహణకు సంబంధించి తన ప్రాధాన్యతలు లేదా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఇప్పుడే వెల్లడించడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు. ‘ఐసీఐసీఐ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయిందనే వాదనతో నేను ఏకీభవించను. పొరపాట్లు జరుగుతుంటాయి. మనం వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలి. మేము ఆ పని చేయగలమని భరోసా ఇస్తున్నాను’ అని చతుర్వేది అన్నారు. కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పదవి నుంచి 2013 జనవరిలో పదవీవిరమణ పొందిన చతుర్వేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌లో అయిదేళ్ల పాటు పనిచేశారు.