బిజినెస్

నేడు ‘జీఎస్‌టీ డే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: దేశ పన్నుల విధానంలో అసాధారణ రీతిలో తీసుకొచ్చిన సంస్కరణలో భాగస్వాములు కావడానికి పన్ను చెల్లింపుదారులు సంసిద్ధులుగా ఉన్నారనే విషయానికి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను ప్రవేశపెట్టిన ఈ తొలి ఏడాదియే నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం పేర్కొంది. కొత్త పరోక్ష పన్ను వ్యవస్థ అయిన జీఎస్‌టీని ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఈ సంవత్సరం జూలై ఒకటో తేదీన ‘జీఎస్‌టీ దినోత్సవం’ (జీఎస్‌టీ డే)ను నిర్వహించనుంది. పార్లమెంటు సెంట్రల్ హాలులో నిరుడు జూన్ 30వ తేదీ అర్ధరాత్రి నిర్వహించిన ఒక కార్యక్రమంలో జీఎస్‌టీని ప్రారంభించి, జూలై ఒకటో తేదీనుంచి అమలులోకి తెచ్చారు. ఆదివారం నిర్వహించనున్న జీఎస్‌టీ దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర రైల్వే, బొగ్గు, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొంటారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో డజనుకు పైగా ఉన్న స్థానిక పన్నులను కలిపి జీఎస్‌టీని ప్రవేశపెట్టడం ద్వారా భారత్‌ను ‘ఒకే దేశం, ఒకే పన్ను’గా మార్చడం జరిగిందని, దేశాన్ని ఒకే ఎకనమిక్ యూనియన్‌గా తీర్చిదిద్దడం జరిగిందని పేర్కొంది.