బిజినెస్

మార్చి 31వరకు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబాయి, జూన్ 30: పన్ను చెల్లింపుదార్లకు శుభవార్త. ఆధార్ కార్డు, పాన్ కార్డును అనుసంధానం చేసేందుకు గడువును వచ్చే ఏడాది 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది. ఆధార్, పాన్ కార్డు అనుసంధానం పొడిగిస్తారా లేదా అనే సందిగ్ధత శనివారం రాత్రి వరకు నెలకొంది. దీంతో పన్ను చెల్లింపుదార్లు ఆందోళన చెందారు. దేశంలో పెద్ద ఎత్తున పన్ను చెల్లింపుదార్లు ఆధార్, పాన్ లింక్ ఇంకా చేసుకోలేదు. ఆధార్, పాన్ లింక్‌కు డెడ్‌లైన్‌ను 2019 మార్చి 31వ తేదీ వరకు పొడిగించడంతో పన్ను చెల్లింపుదార్లు ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు కూడా జూన్ 30వ తేదీలోగా ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం ప్రక్రియ పూర్తికావాలని గతంలో ప్రకటించింది. ఈ డెడ్‌లైన్‌లోపల పాన్, ఆధార్ కార్డుల మధ్య అనుసంధానం చేసుకోలేని వారి సంగతి ఏమిటి ? ఈ అంశంపై అయోమయం నెలకొని ఉందని, గడువును పొడిగించాలని చార్టెర్డ్ అకౌంటెంట్లు కేంద్రాన్ని కోరారు. ఈ రెండు కార్డుల మధ్య అనుసంధానం చేసేందుకు గడువును పొడిగించాల్సిందేనని మార్కెట్ నిపుణులు కేంద్రంపై వత్తిడి తెచ్చారు. సాంకేతికంగా చూస్తే ఆదాయం పన్ను శాఖ చట్టంలో సెక్షన్ 139ఏఏ (2) కింద ఆధార్, పాన్ కార్డుల మధ్య అనుసంధానం ప్రక్రియ చేయకపోతే, పాన్ కార్డు చెల్లదు. దీని కోసమే జూన్ 30వ తేదీ డెడ్‌లైన్‌ను విధిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గతంలో ఆదేశాలు ఇచ్చింది. పన్నులపై పరిశోధన చేసే చేతన్ చందక్ అనే నిపుణుడు మాట్లాడుతూ కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. గడువును పొడిగించని పక్షంలో పాన్, ఆధార్ కార్డులమధ్య అనుసంధానం చేయని పన్ను చెల్లింపుదార్లు ఇక్కట్లకు గురయ్యే అవకాశం ఉందన్నారు. పన్ను చెల్లింపుదార్లు జూన్ 30వ తేదీ తర్వాత రిటర్న్‌లను దాఖలు చేసేందుకు అనుమతించరన్నారు. ఒక వేళ రిటర్న్స్ దాఖలు చేసినా, ఈ రెండుకార్డుల మధ్య అనుసంధానం చేసి ఉండని పక్షంలో వారి రిటర్న్స్ పరిశీలన ప్రక్రియ పూర్తి కాకపోవచ్చన్నారు. కాని ఎటువంటి పరిస్థితుల్లో అనుసంధానం జరగలేదని పాన్ కార్డును డియాక్టివేట్ చేయరాదని, చట్టబద్ధతను తొలగించరాదని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే తీర్పు ఇచ్చిందన్నారు. ఆధార్ కార్డు లేని వారు పాన్ కార్డుతో అనుసంధానం చేయలేరనే కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా, ఈ స్టే రెండు కార్డులు ఉన్న వారికి వర్తించదని పీపుల్ అడ్వైజరీ సర్వీసస్ పన్నుల నిపుణురాలు షాలిని జైన్ తెలిపారు.