బిజినెస్

ఊపందుకోనున్న మాల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, జూన్ 30: దేశంలో ఆన్‌లైన్ బిజినెస్ పెరిగినా, ఫోన్ చేస్తే చాలు ఇంటికే వచ్చి వస్తువుల డెలివరీ విధానం ఊపందుకున్నా, మాల్స్‌కు మాత్రం ఆదరణ తగ్గదు. వచ్చే ఐదేళ్లలో దేశంలో 85కు పైగా అతి పెద్ద షాపింగ్ మాల్స్ రాబోతున్నాయని ప్రోపర్టీ కనె్సల్టెంట్ అనరాక్ విశే్లషించారు. ఈ కామర్స్ జోరందుకుంది. ఇంట్లో కూర్చుని ఎంచక్కా తమకు కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకోవడం వల్ల మాల్స్‌కు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందనుకోవడం భ్రమ అని ఆయన అన్నారు. షాపింగ్ మాల్స్ సంస్కృతి ఇప్పుడిప్పుడే భారత్‌లో పెరుగుతోందన్నాన్నారు. 85 మాల్స్‌లో 30 మాల్స్ 14 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వస్తున్నాయి. 2020 నాటికి దేశంలోని అతి పెద్ద ఎనిమిది నగరాల్లో ఈ మాల్స్ రాబోతున్నాయన్నారు. మరోనిపుణుడు కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఆన్‌లైన్‌లో కంటే మాల్స్‌కు వెళ్లి వస్తువులు కొనుగోలుకు కస్టమర్లు ఆసక్తికనపరుస్తారన్నారు. మాల్స్‌కు వెళ్లి వస్తువులు కొనుగోలు చేసే వారికి టచ్ , ఫీల్ అనుభూతి ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చోకుండా వారాంతపు సెలవుల్లో హాయిగా మాల్స్‌కు వెళ్లి తమకు కావాల్సినవి ఎంపిక చేసుకుంటారన్నారు. ముంబాయి, చెన్నై, బెంగళూరు, పూణేలో మాల్స్ హిట్టయ్యాయన్నారు. ప్రస్తుతం రెండవ శ్రేణి నగరాలకు మాల్స్ కల్చర్ వ్యాపిస్తోంది. అహ్మదాబాద్, చండీఘడ్, లక్నో, జైపూర్ నగరాల్లో కూడా మాల్స్ విపరీతంగా వస్తున్నాయన్నారు. మాల్స్‌ను వస్తు విక్రయ కేంద్రాలుగా మార్చకుండా, వినోదాత్మకంగా ఉండాలని, అప్పుడే కస్టమర్లు ఉత్సాహపడుతారన్నారు. పెద్ద మాల్స్ కస్టమర్లకు అవసరమైన వినోదాన్ని ఇచ్చే కార్యక్రమాలను నిర్వహించే సత్తాను కలిగి ఉంటారు. కొన్ని చోట్ల మాల్స్ విఫలమయ్యాయి. జనానికి ఆసక్తిలేని ప్రాంతాల్లో మాల్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల రాణించలేక మూతపడ్డాయి. సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం, ఫుడ్ కోర్టులు లేకపోవడం కూడా మాల్స్ బిజినెస్ పడిపోతుందని విశే్లషకులు అంటున్నారు.