బిజినెస్

రైతు బీమా వినియోగించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: రైతుబంధు బీమా (రైతులకు జీవిత బీమా) ను రాష్ట్రంలోని రైతులంతా పూర్తిగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కమిషనరేట్‌లో కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్‌తో కలిసి మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 లక్షల మంది రైతులను సంప్రదించగా, వీరిలో 22.08 లక్షల మంది బీమాకు అర్హులని తేలిందని (18-59 సంవత్సరాల మధ్య వయస్సున్నవారు) వీరి పేర్లతో బీమా సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతుబంధు పేరుతో చెక్కుల పంపిణీ సందర్భంగా 57.89 లక్షల చెక్కులను పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఈ లెక్కన మరో 30 లక్షల మంది రైతులు తమ పేర్లను బీమా పథకం కింద నమోదు చేసుకోవాల్సి ఉందన్నారు. గ్రామ స్థాయిలో (క్షేత్రస్థాయిలో) వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) లు, రైతు సమన్వయ సమితి గ్రామ కమిటీ సభ్యులు కలిసి రైతుబీమా పథకం కోసం పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం రైతులకోసమే రైతుబీమాను చేపట్టిందని, అందువల్ల రైతులు స్వయంగా ఏఈఓల వద్దకు వెళ్లి తమ పేర్లను, నామినీ పేర్లను, చిరునామా, భూముల సర్వేనెంబర్, విస్తీర్ణం తదితర వివరాలను ఇవ్వాలని సూచించారు. దీని వల్ల ఈ నెల 15 వరకు రైతుబీమా పథకం కింద అందరి పేర్లతో జాబితాను సిద్ధం చేసి, బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ కి అందించేందుకు వీలవుతుందన్నారు.
18-59 సంవత్సరాల మధ్య రైతులకు అయిదులక్షల రూపాయల వరకు జీవిత బీమా సౌకర్యం కల్పించామని గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఈ వయస్సులో ఉన్న రైతులకు ఒక్కొక్కరికి 2271 రూపాయల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. 60 సంవత్సరాలపైబడ్డ వారికి కూడా ఈ సదుపాయం కల్పించాలంటే ప్రీమియంగా 17 వేల రూపాయలు ఎల్‌ఐసీకి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇంత మొత్తం చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారుతుందని పేర్కొన్నారు.
రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామంటూ బీజేపీ జాతీయ స్థాయిలో ప్రకటన చేస్తుందా అంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణమాఫీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. బీజేపీ జాతీయ పార్టీ అన్న విషయాన్ని లక్ష్మణ్ మరవవద్దని, జాతీయ పార్టీ ఏ పథకం గురించి మాట్లాడినా జాతీయ స్థాయిలో అమలయ్యే విధంగా ఉండాలన్నారు. రెండులక్షల రూపాయల రుణమాఫీపై ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు కింద 4914 కోట్లు డ్రా
రైతుబంధు పథకం కింద ఇప్పటి వరు 4914 కోట్ల రూపాయలను బ్యాంకుల నుండి 47.20 లక్షల మంది రైతులు డ్రా చేసుకున్నారని గుత్తా తెలిపారు. మొత్తం 57.89 లక్షల చెక్కులను ముద్రించారని, వీటిలో 48.54 లక్షల చెక్కుల పంపిణీ జరిగిందన్నారు.