బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 3: రూపాయి విలువ పుంజుకోవడంతో పాటు దేశీయ సంస్థాగత మదుపరుల నుంచి అందిన కీలక కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 114 పాయింట్లకు పైగా పెరిగి, 35,378.60 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 42 పాయింట్లు పుంజుకొని, దాదాపు 10,700 పాయింట్ల వద్ద స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే విషయంలో ప్రపంచ పరిణామాలు మిశ్రమంగా ఉండగా, మదుపరులు ఇటీవల ధరలు పడిపోయిన షేర్లను కొనుగోలు చేయడం వల్ల దేశీయ మార్కెట్ కీలక సూచీలు పుంజుకోగలిగాయి. దీంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు కనిష్ట స్థాయిల నుంచి కోలుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం ఉదయం బలహీనమయిన స్థాయి వద్ద ప్రారంభమయినప్పటికీ, ఫార్మా, ఐటీ స్టాక్‌లకు లభించిన కొనుగోళ్ల మద్దతు కారణంగా ఇంట్రా-డేలో 35,445.21 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 114.19 పాయింట్ల (0.32 శాతం) పైన 35,378.60 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం సెషన్‌లో 159 పాయింట్లు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా క్రితం ముగింపుతో పోలిస్తే మంగళవారం 42.60 పాయింట్లు (0.40 శాతం) పుంజుకొని, 10,699.90 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,630.25- 10,713.30 పాయింట్ల మధ్య కదలాడింది. సన్ ఫార్మా, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, ఓఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్, ఐటీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, రిల్, టీసీఎస్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో షేర్లు మంగళవారంనాటి లావాదేవీలలో లాభాలతో ముగిశాయి. మరోవైపు, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్ గ్రిడ్, యెస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయ.