బిజినెస్

ఐడియా-వొడాఫోన్ విలీనానికి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీనాన్ని ప్రభుత్వం ఆమోదించిందని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అయితే ఈ ఒప్పందం పూర్తి కావాలంటే రెండు కంపెనీలు కొన్ని లాంఛనాలను పూర్తి చేయవలసిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) బుధవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మనోజ్ సిన్హా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విడిగా విలేఖరులతో మాట్లాడుతూ ‘ఐడియా- వొడాఫోన్ విలీనాన్ని మేము ఇప్పటికే ఆమోదించాం. అయితే ఆ విలీనం పూర్తి కావాలంటే ఆ కంపెనీలు పెండింగ్‌లో ఉన్న కొన్ని లాంఛనాలను పూర్తి చేయవలసి ఉంది’ అని అన్నారు. ఐడియా- వొడాఫోన్ విలీనాన్ని ధ్రువీకరిస్తూ ప్రభుత్వం వైపు నుంచి వెలువడిన తొలి అధికారిక ప్రకటన ఇది. ఐడియా- వొడాఫోన్ విలీనానికి టెలికం శాఖ ఈ నెల 9న షరతులతో కూడిన ఆమోదం తెలపడంతో బ్రిటన్‌కు చెందిన టెలికం కంపెనీ వొడాఫోన్ ఉన్నత స్థాయి అధికారుల బృందం మంగళవారం టెలికం మంత్రి మనోజ్ సిన్హాను కలిసింది. ‘వారు నన్ను కలిశారు. రెండు కంపెనీల విలీనానికి త్వరగా ఆమోదం తెలిపినందుకు నాకు కృతజ్ఞతలు తెలిపారు’ అని సిన్హా వెల్లడించారు.