బిజినెస్

ఇనె్వస్టర్ల ఆకర్షణకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామని పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి 26 మంది పర్యాటక రంగ పెట్టుబడిదారులు వచ్చారన్నారు. ఏఎన్‌ఏ టెక్నాలజీస్, అమరావతి టూరిజం, సముద్ర షిప్‌యార్డు, షోర్ ఫ్యూ హాస్పిటాలిటీ, స్కై చోపర్స్, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ సంస్థలు ఈ సమావేశానికి హాజరై పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. రాష్ట్రంలో 2029 నాటికి ఈ రంగంలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆంధ్రాలో ఇప్పటికే సుప్రసిద్ధ హాస్పిటాలిటీ బ్రాండ్లు అయిన ఐటిసి, ఎకార్ గ్రూప్, తాజ్ జె డబ్ల్యు మారియట్ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇంతవరకు 33 ప్రాజెక్టుల్లో 2,400 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టినట్లు ఆయన చెప్పారు.